రాహుల్ అక్కడ ఓడిపోతే.. రాజకీయాలకు గుడ్ బై చెప్తా..

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీ లోక్‌సభ స్థానానికి పోటీచేస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు ఈ సారి కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. అమేథీలో ఓటమి భయంతోనే రాహుల్ వయనాడ్‌కు పారిపోయాడంటూ బీజేపీ ఎద్దేవా చేస్తూ వస్తోంది. అయితే రాజకీయ నాయకుడిగా మారిన మాజీ క్రికెటర్, పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజోత్‌సింగ్ సిద్ధూ సంచలన సవాల్ చేశారు. ఒకవేళ రాహుల్ అమేథీ నుంచి ఓడిపోతే.. తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానని అన్నారు. గుండు […]

రాహుల్ అక్కడ ఓడిపోతే.. రాజకీయాలకు గుడ్ బై చెప్తా..
Follow us

| Edited By:

Updated on: Apr 29, 2019 | 3:16 PM

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీ లోక్‌సభ స్థానానికి పోటీచేస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు ఈ సారి కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. అమేథీలో ఓటమి భయంతోనే రాహుల్ వయనాడ్‌కు పారిపోయాడంటూ బీజేపీ ఎద్దేవా చేస్తూ వస్తోంది. అయితే రాజకీయ నాయకుడిగా మారిన మాజీ క్రికెటర్, పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజోత్‌సింగ్ సిద్ధూ సంచలన సవాల్ చేశారు. ఒకవేళ రాహుల్ అమేథీ నుంచి ఓడిపోతే.. తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానని అన్నారు. గుండు సూది నుంచి విమానం తయారీ దాకా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు.