మా ప్రధానితో ఏకీభవిస్తా: అఫ్రిదీ

ఇస్లామాబాద్: పుల్వామా దాడి ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఇండియా వైపు నుంచి ఎలాంటి దాడి జరిగినా పాకిస్థాన్ తిప్పికొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. యుద్ధం ప్రకటించడం, ప్రారంభించడం తేలికే కానీ ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఆలోచించుకోండని ఇమ్రాన్‌ భారత్‌ను హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే పాక్ ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలకు పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ మద్దతునిచ్చాడు. […]

మా ప్రధానితో ఏకీభవిస్తా: అఫ్రిదీ
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 6:37 PM

ఇస్లామాబాద్: పుల్వామా దాడి ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఇండియా వైపు నుంచి ఎలాంటి దాడి జరిగినా పాకిస్థాన్ తిప్పికొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. యుద్ధం ప్రకటించడం, ప్రారంభించడం తేలికే కానీ ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఆలోచించుకోండని ఇమ్రాన్‌ భారత్‌ను హెచ్చరించిన విషయం తెలిసిందే.

అయితే పాక్ ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలకు పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ మద్దతునిచ్చాడు. తమ ప్రధాని చేసిన వ్యాఖ్యలు చాలా స్పష్టంగా ఉన్నయంటూ అతను వంతపాడాడు. ప్రధాని స్పీచ్‌ని రీట్వీట్ చేసిన అఫ్రిదీ ‘‘క్రిస్టల్ & క్లియర్’’ అని పేర్కొన్నాడు. అయితే ఓ క్రీడాకారుడు అయి ఉండి.. యుద్ధానికి మద్దతు ఇవ్వడాన్ని కొందరు తప్పుబడుతుంటే.. మరికొందరు మాత్రం.. అఫ్రిదీ తన దేశభక్తిని చాటి చెప్పాడు అంటూ.. కామెంట్ చేశారు.