కరోనాతో కోమాలోకి డాక్టర్‌.. లేచిన తర్వాత అన్న మాటలు చూస్తే..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ.. కంటికి కనిపించని ఆ కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే లక్షన్నర మందికి పైగా పొట్టనబెట్టుకుంది. అయితే ఈ కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 23 లక్షలు దాటింది. దీనికి కులం, మతం, రంగు, భాష,ప్రాంతం అన్న తేడా ఏమీ లేదు. అందరిపైన ఇది ప్రభావం చూపుతోంది. తాజాగా బెల్జియంకు చెందిన ఓ వైద్యుడు కరోనా బారినడపడ్డాడు. అయితే ఆయన కరోనా […]

కరోనాతో కోమాలోకి డాక్టర్‌.. లేచిన తర్వాత అన్న మాటలు చూస్తే..
Follow us

| Edited By:

Updated on: Apr 19, 2020 | 11:42 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ.. కంటికి కనిపించని ఆ కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే లక్షన్నర మందికి పైగా పొట్టనబెట్టుకుంది. అయితే ఈ కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 23 లక్షలు దాటింది. దీనికి కులం, మతం, రంగు, భాష,ప్రాంతం అన్న తేడా ఏమీ లేదు. అందరిపైన ఇది ప్రభావం చూపుతోంది. తాజాగా బెల్జియంకు చెందిన ఓ వైద్యుడు కరోనా బారినడపడ్డాడు. అయితే ఆయన కరోనా ప్రభావంతో ఏకంగా కోమాలోకే వెళ్లిపోయాడట. ఆ తర్వాత అతను లేచిన తర్వాత.. ఆయన తన అనుభూతిని అక్కడి తన బృందంతో షేర్ చేసుకున్నాడట. లక్షల మందిని చంపిన ఈ మహమ్మారి తనను కూడా చంపేస్తుందని భావించాడట. తాజాగా ఆయన కరోనా నుంచి బయటపడ్డాడు. అనంతరం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లాడు.

ఆంటోనీ సస్సేన్‌ అనే 58 ఏళ్ల వైద్యుడు కరోనాను జయించిన తర్వాత చెప్పిన మాటలివి. బెల్జియంకు చెందిన ఇతను.. యూరాలజిస్టుకు చెందిన డాక్టర్. అయితే కొన్ని రోజుల క్రితమే కరోనా సోకి తాను పనిచేస్తున్న ఆస్పత్రిలోనే పేషంట్‌గా చేరిపోయాడు. అయితే ఇతనికి కరోనా సోకడంతో.. వెంటనే ఆస్పత్రి యాజమాన్యం.. అక్కడ పనిచేసే సిబ్బంది అందరికీ పరీక్షలు చేసింది. అయితే ఆంటోనీ పరిస్థితి విషమంగా మారుతుండటంతో.. వెంటనే ఆయన్ను ఐసీయూలో చేర్చింది. మూడువారాలపాటు కోమాలో ఉన్నఆయన.. ఆ తర్వాత ఇటీవలే కోలుకున్నాడు.