రెండో దశ ఎన్నికలకు సంబంధించి… తమిళనాడు, కర్ణాటకలో ప్రచారం ముగిసేలోపే… ఐటీ అధికారులు దాడులతో విరుచుకుపడ్డారు. ప్రధానంగా ఎన్డీయే కూటమికి సవాల్ విసురుతున్న DMK, JDS పార్టీల నేతలు, వాళ్ల బంధువులు, సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేశారు. తూత్తుకుడి లోక్‌సభ నియోజకవర్గం డీఎంకే అభ్యర్థి కనిమొళి నివాసం, కార్యాలయంలో మంగళవారం రాత్రి ఆదాయపు పన్ను శాఖ అధికారులు మెరుపు సోదాలు నిర్వహించారు. తూత్తుకుడిలోని కురింజి నగర్లో ఆమె నివసిస్తున్న ఇల్లు, కార్యాలయంలో మంగళవారం రాత్రి ఐటీ విభాగానికి చెందిన పదిమంది సభ్యుల బృందం సోదాల్లో పాల్గొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు నగదు పంచిపెడుతున్నట్టు ఇప్పటికే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు జరిగాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే డీఎంకే కోశాధికారి దురైమురుగన్, ఆయన కుమారుడు వేలూరు అభ్యర్థి కదిర్ ఆనంద్, డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్, ఎమ్మెల్యే హాస్టల్లోని మంత్రులు ఆర్బీ ఉదయకుమార్, ఉడుమలై రాధాకృష్ణన్‌ల గదుల్లో ఐటీ సోదాలు చోటుచేసుకున్నాయి. డీఎంకేను లక్ష్యంగా చేసుకుని ఈ సోదాలు జరుగుతున్నాయని, నెల రోజులుగా మూసి ఉన్న రాష్ట్రమంత్రుల గదుల్లో కంటితుడుపు కోసమే సోదాలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
Breaking News
- ఏడు నెలల పాలనలో జగన్ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
- ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
- కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్ కౌంటర్ల ద్వారా టోల్ వసూలు చేస్తున్న సిబ్బంది.
- చిత్తూరు టూటౌన్ పీఎస్ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
- చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్. భారత్-విండీస్ మధ్య తొలివన్డే.
- తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
- విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.