ఆ విషయం చెప్పగానే రాజమౌళి ఒప్పుకున్నారు: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఆచార్యలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే

ఆ విషయం చెప్పగానే రాజమౌళి ఒప్పుకున్నారు: చిరంజీవి
Follow us

| Edited By:

Updated on: Sep 26, 2020 | 11:47 AM

Chiranjeevi Acharya movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఆచార్యలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. మొదట చెర్రీది అతిథి పాత్ర అని వార్తలు రాగా.. తాజా సమాచారం ప్రకారం 40 నిమిషాల పాటు అతడి పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆర్‌ఆర్‌ఆర్‌కి డేట్లు క్లాష్ అవుతున్నాయని.. అయినా చెర్రీ ఆచార్యకే మొగ్గు చూపుతున్నాడని, దీంతో అతడిపై జక్కన్న అసహనంతో ఉన్నట్లు టాక్ నడిచింది. అయితే ఈ మూవీలో చెర్రీ నటించేందుకు రాజమౌళి ఒప్పుకున్నట్లు చిరంజీవి వెల్లడించారు.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన చిరు.. ”చెర్రీ, నేను కలిసి నటించాలని నా భార్య కోరిక. ఇదే విషయాన్ని రాజమౌళికి చెప్పా. ఆచార్య షూటింగ్‌ కోసం చెర్రీకి పర్మిషన్ ఇవ్వాలని కోరా. అది విన్న వెంటనే జక్కన్న ఓకే చెప్పి, చెర్రీకి అనుమతిని ఇచ్చారు” అని చెప్పుకొచ్చారు. కాగా టాలీవుడ్ సమాచారం ప్రకారం చిరు కంటే ముందుగానే చెర్రీ, ఆచార్య షూటింగ్‌లో పాల్గొననున్నారట. చెర్రీపై ఉన్న సన్నివేశాలన్నీ కొరటాల తెరకెక్కించనున్నారట. ఇక ఇందులో చెర్రీ పాత్రకు హీరోయిన్ కూడా ఉండనుందని, అందుకోసం రష్మిక మందనతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఇక సామాజిక కథాంశంతో తెరకెక్కనున్న ఈ మూవీలో చిరు సరసన కాజల్ అగర్వాల్ రెండోసారి జత కట్టబోతోంది. సోనూసూద్‌, అజయ్‌, హిమజ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రెజీనా ఓ స్పెషల్ సాంగ్‌లో మెరవనుంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read More:

13ఏళ్ల క్రితం నాటి ఫ్లాప్‌.. ఇప్పటికీ అప్పులు కడుతోన్న బాలయ్య నిర్మాత

కరోనా అప్‌డేట్స్‌: దేశవ్యాప్తంగా 85,362 కొత్త కేసులు

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!