సైన్యానికి సెల్యూట్: రాహుల్

న్యూఢిల్లీ: భారత సైన్యానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సెల్యూట్ చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి భారత వాయు సేనలు చొచ్చుకుపోయి దాడి చేశాయని తెలియగానే ఆయన సోషల్ మీడియాలో తన స్పందన తెలియజేశారు. వాయుసేన పైలెట్లకు సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు. పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకార దాడి చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో వెయ్యి కేజీల బాంబులతో ఉగ్రవాదులపై భారత్ దాడి చేసింది. మంగళవారం తెల్లవారుజామున […]

సైన్యానికి సెల్యూట్: రాహుల్
Follow us

|

Updated on: Feb 26, 2019 | 12:04 PM

న్యూఢిల్లీ: భారత సైన్యానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సెల్యూట్ చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి భారత వాయు సేనలు చొచ్చుకుపోయి దాడి చేశాయని తెలియగానే ఆయన సోషల్ మీడియాలో తన స్పందన తెలియజేశారు. వాయుసేన పైలెట్లకు సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు.

పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకార దాడి చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో వెయ్యి కేజీల బాంబులతో ఉగ్రవాదులపై భారత్ దాడి చేసింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల సమయంలో ఈ దాడి జరిగింది. జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ చేసిన ఈ దాడిలో 200కి పైగా ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం అందుతోంది.

అయితే భారత రక్షణ శాఖ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు పాక్ మాత్రం లైన్ ఆఫ్ కంట్రోల్‌ను దాటుకుని వచ్చిన భారత విమానాలను తిప్పికొట్టామని ప్రకటించుకుంది.

ప్రధాని మోడీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. తదితరులు సమావేశమై చర్చలు జరుపుతున్నారు.