ఫత్వా జారీ చేస్తారా ? అన్ని మతాలూ నాకు సమానమే ! నుస్రత్ జహాన్ !

నుదుట బొట్టు పెట్టుకుని, చేతులకు గాజులు తొడుక్కుని హిందూ స్త్రీలా తాను పార్లమెంటులో కనిపించడంపై.. ముస్లిం మత గురువులు తనకు ఫత్వా జారీ చేయడంపై మండిపడింది 29 ఏళ్ళ బెంగాలీ నటి, మొదటిసారిగా ఎంపీ అయిన నుస్రత్ జహాన్.. పశ్చిమ బెంగాల్ లోని బసీర్హట్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నుస్రత్.. 3.5 లక్షల ఓట్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అన్ని మతాలూ, కులాలతో కూడిన ఈ భారతదేశానికి […]

ఫత్వా జారీ చేస్తారా ? అన్ని మతాలూ నాకు సమానమే ! నుస్రత్ జహాన్ !
Follow us

|

Updated on: Jun 30, 2019 | 4:05 PM

నుదుట బొట్టు పెట్టుకుని, చేతులకు గాజులు తొడుక్కుని హిందూ స్త్రీలా తాను పార్లమెంటులో కనిపించడంపై.. ముస్లిం మత గురువులు తనకు ఫత్వా జారీ చేయడంపై మండిపడింది 29 ఏళ్ళ బెంగాలీ నటి, మొదటిసారిగా ఎంపీ అయిన నుస్రత్ జహాన్.. పశ్చిమ బెంగాల్ లోని బసీర్హట్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నుస్రత్.. 3.5 లక్షల ఓట్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అన్ని మతాలూ, కులాలతో కూడిన ఈ భారతదేశానికి తను ప్రాతినిధ్యం వహిస్తున్నానని, ఈ దేశం కుల మతాలకు అతీతమైనదని ఆమె పేర్కొంది. నేనింకా ముస్లిమునే… కానీ అన్ని మతాలను గౌరవిస్తాను.. అన్నీ గౌరవప్రదమైనవే అని నుస్రత్ వ్యాఖ్యానించింది. తాను ఎలాంటి దుస్తులు ధరించాలో ఎవరూ కామెంట్ చేయజాలరని, విశ్వాసమన్నది అన్ని అలవాట్లనూ మించినదని ఆమె పేర్కొంది.

మతపరమైన అభిప్రాయాలపైన ఎవరైనా రియాక్ట్ కావడం ద్వేషాన్ని, హింసనూ పెంచుతుందని, ఇందుకు చరిత్రే నిదర్శనమని నుస్రత్ కౌంటరిచ్చింది.గత జూన్ 25 న పార్లమెంటులో ఎంపీగా ప్రమాణం చేస్తున్నప్పుడు ఈమె అచ్చు హిందూ వనితలా చీర ధరించి, బొట్టు, గాజులతో కనిపించడం ఇస్లామిక్ సిధ్ధాంతాలకు వ్యతిరేకంగా ఉందని, ఇందుకు క్షమాపణ చెప్పాలంటూ కొందరు ముస్లిం మత గురువులు ఫత్వా జారీ చేశారు. కానీ వీటికి బెదిరేది లేనట్టు ఆమె తీవ్రంగా ఈ ఫత్వాను ఖండించింది. టర్కీలో గత జూన్ 19 న నుస్రత్ జహాన్.. నిఖిల్ జైన్ అనే బిజినెస్ మన్ ని వివాహం చేసుకుంది. కాగా-వెస్ట్ బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసి.. .లోక్ సభ ఎన్నికల్లో .నుస్రత్ తో బాటు 17 మంది మహిళలకు టికెట్లు ఇచ్చింది.