Breaking News
  • భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 31 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 131868. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 73560. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 54441. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 3867. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • కరోనా తెలంగాణా బులిటిన్. ఇవ్వాళ తాజాగా 41 పాజిటివ్ కేసులు నమోదు. మొత్తం రాష్ట్రంలో 1854 కరోనా పాజిటివ్ కేసులు . ఇవ్వాళ నలుగురు మృతి. మొత్తం ఇప్పటివరకు 53 మంది కరోనా కు బలి అయ్యారు. యాక్టీవ్ కేసులు 709 మంది చికిత్స పొందుతున్నారు.
  • తిరుమల: ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల రుసుము రీఫండ్. జూన్ 30వ తేది వరకు శ్రీవారి ఆర్జిత సేవలు, వీఐపీ దర్శన టికెట్లు, తిరుమలలో గదులు బుక్ చేసుకున్న భక్తులకు డబ్బులు రీఫండ్. టికెట్ల వివరాలను refunddesk_1@tirumala.org మెయిల్ ఐడీకి పంపాలని భక్తులను కోరిన టీటీడీ.
  • వరంగల్ 9 మర్డర్ కేసు లో సంచలన బ్రేకింగ్ . 9 మందిని హత్య చేసింది సంజయ్ . మాక్సుద్ భార్య చెల్లెలి తో సంబంధం ఉన్న సంజయ్. మాక్సుద్ భార్య చెల్లలి తో అక్రమ సంబంధం ఉన్న సంజయ్. తనకు అడ్డు రావొద్దని మాక్సుద్ కుటుంబం తో పాటు సన్నిహితంగా ఉన్న బిహారి యువకులను హత్య చేసిన సంజయ్.
  • CRPF జవాన్ లకు కరోనా పాజిటివ్. ఈ రోజు 9 మంది CRPF జవాన్ కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. దేశ వ్యాప్తంగా మొత్తం 359 CRPF సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరణ. 137 యాక్టీవ్ కేస్ లు. 220 మంది డిశ్చార్జ్, ఇద్దరు మృతి.
  • దేశ వ్యాప్తంగా భానుడి భగ భగ. పంజాబ్, హర్యానా, దక్షిణ యుపి, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉంటాయని IMD హెచ్చరిక.. రాబోయే 5 రోజుల్లో తీవ్రమైన హీట్ వేవ్ ఉంటాయని హెచ్చరిక.

స్వరం మార్చిన జకీర్.. టెర్రరిజంతో నాకేం లింక్ లేదు..!

I never created terrorists.. Zakir Naik tells India’s NIA, స్వరం మార్చిన జకీర్.. టెర్రరిజంతో నాకేం లింక్ లేదు..!

వివాదాస్పద ఇస్లాం మత ప్రబోధకుడు జకీర్ నాయక్.. తన స్వరం మార్చాడు. అసలు ఉగ్రవాదంతో నాకు ఎలాంటి సంబంధం లేదంటూ ప్రకటించాడు. ఆయన చేసిన ప్రసంగాలతో పలువురు యువకులు ఉగ్రవాదానికి ఆకర్షితులైయ్యారంటూ ఎన్ఐఏ ఆయనపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన అప్పటి నుంచి దేశం విడిచి మలేసియాలో దాక్కున్నాడు. అయితే అక్కడ కూడా జకీర్ చేసిన ప్రసంగాలపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది.

ఎన్ఐఏ తనపై మూడేళ్ల పాటు విచారణ చేపట్టిందని.. కానీ చివరకు ఎన్ఐఏకు వాదనకు అనుకూలంగా ఒక్క సాక్ష్యం కూడా వారి దగ్గర లేదంటూ జకీర్ ఓ వార్తా సంస్థకు తెలిపారు. అయితే దేశవ్యాప్తంగా అరెస్టు చేసిన 127 మంది అనుమానితుల్లో.. ఎక్కువ మంది ఐఎస్ సానుభూతిపరులేనని ఎన్ఐఏ పేర్కొంటుంది. వీరంతా మత ప్రబోధకుడు జకీర్ నాయక్ ప్రసంగాలకు ఆకర్షితులైన వారేనంటూ ఎన్ఐఏ తేల్చి చెప్తోంది. 2014 నుంచి ఇప్పటి వరకు 28 కేసుల్లో 127 మందిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. వీరిలో తమిళనాడు నుంచి 33 మంది, ఉత్తర్ ప్రదేశ్‌ నుంచి 19, కేరళ 17, తెలంగాణలో 14, మహారాష్ట్రలో 12, కర్ణాటకలో 8, ఢిల్లీలో 7, ఉత్తరాఖండ్‌లో ఒకరు, వెస్ట్ బెంగాల్ ఒకరు, జమ్ముకశ్మీర్‌లో ముగ్గురు ఉన్నారని ఎన్ఐఏ లెక్కలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే జకీర్ నాయక్‌పైన, ఆయన సంస్థ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎస్)పైన ఎన్ఐఏ పలు కేసులు నమోదు చేసింది. అయితే అప్పటి నుంచి జకీర్ నాయక్ విదేశాలకు పారిపోయారు. మలేసియాలో నివాసం ఏర్పరచుకోవడంతో ఇప్పటి వరకు ఆయనను ఈ కేసులో ఎన్ఐఏ విచారించలేకపోయింది. ఆయనను తమకు అప్పగించాలంటూ ఎన్ఐఏ ఇప్పటికే మలేసియా ప్రభుత్వాన్ని కోరింది.

Related Tags