నా శరీరం నా ఇష్టం.. ఎలాగైనా ఎక్స్‌పోజింగ్ చేస్తా అంటున్న ప్రముఖ గాయని..

బాలీవుడ్‌లో వివాదాస్పద గాయనిగా పేరు మోసిన సోనా మొహపాత్ర గురించి అందరికీ తెలిసిందే. 'మీటూ' ఉద్యమంలో సంచలన కామెంట్స్‌తో హాట్ టాఫిక్‌గా మారింది. ఇటీవల 'ఐ నెవర్ ఆస్క్ ఫర్ ఇట్' పేరుతో ఓ ఛాలెంజ్‌ను కూడా మొదలెట్టింది.

  • uppula Raju
  • Publish Date - 2:30 pm, Tue, 24 November 20
నా శరీరం నా ఇష్టం.. ఎలాగైనా ఎక్స్‌పోజింగ్ చేస్తా అంటున్న ప్రముఖ గాయని..

బాలీవుడ్‌లో వివాదాస్పద గాయనిగా పేరు మోసిన సోనా మొహపాత్ర గురించి అందరికీ తెలిసిందే. ‘మీటూ’ ఉద్యమంలో సంచలన కామెంట్స్‌తో హాట్ టాఫిక్‌గా మారింది. ఇటీవల ‘ఐ నెవర్ ఆస్క్ ఫర్ ఇట్’ పేరుతో ఓ ఛాలెంజ్‌ను కూడా మొదలెట్టింది. అందులో భాగంగా తాను కాలేజీలో ఎదర్కొన్న ఓ సంఘటన గురించి వెల్లడించింది.

తాను సల్వార్ దుస్తులు ధరంచి ల్యాబ్‌కు వెళుతుంటే సీనియర్లు అసహ్యంగా మాట్లాడారని చెప్పింది. తన లో దుస్తుల గురించి అందరికీ వినబడేలా కామెంట్స్ చేశారని పేర్కొంది. అంతేకాకుండా కొంతమంది తన దగ్గరకు వచ్చి చున్నీ సరిగ్గా వేసుకోవచ్చు కదా అని వ్యంగ్యంగా మాట్లాడారని వెల్లడించింది. ఈ సంఘటన గురించి ఓ నెటిజన్ సోషల్ మీడియా కేంద్రంగా కొన్ని కామెంట్స్ పోస్ట్ చేశాడు. అందులో ఈ ఘటన గురించి ఇంత బాధపడుతున్న మీరు హాట్ హాట్ ఫొటో షూట్లు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించాడు. అంతేకాకుండా క్లీవేజ్ బాగా కనిపించే ఫొటోలు షేర్ చేస్తూ ఎక్స్‌పోజింగ్ ఎందుకు చేస్తున్నారని కడిగేశాడు. ఇలాంటి వాటిని పక్కన బెట్టి ముందు పాటలు పాడటంపై మనసు లగ్నం చేయండంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసి మండిపోయిన సోనా నా శరీరం, నా క్లీవేజ్, నాకు నచ్చినట్టు నేనుంటా అంటూ రీ పోస్ట్ చేసింది.