జరిగిందేదో జరిగింది, అంతా కలిసి పార్టీ పటిష్టతకు కృషి చేద్దాం, సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన సంక్షోభం ముగిసింది. ప్రస్తుతానికి పార్టీ అధ్యక్షురాలిగా సోనియా కొనసాగనున్నారు. తనకు పార్టీలో ఎవరిపైనా దురభిప్రాయాలు లేవని, అయితే చాలా బాధ పడ్డానని..

జరిగిందేదో జరిగింది, అంతా కలిసి పార్టీ పటిష్టతకు కృషి చేద్దాం, సోనియా గాంధీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 24, 2020 | 7:05 PM

కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన సంక్షోభం ముగిసింది. ప్రస్తుతానికి పార్టీ అధ్యక్షురాలిగా సోనియా కొనసాగనున్నారు. తనకు పార్టీలో ఎవరిపైనా దురభిప్రాయాలు లేవని, అయితే చాలా బాధ పడ్డానని, కానీ వాళ్ళు తన సహచరులని ఆమె వ్యాఖ్యానించారు. జరిగిందేదో జరిగిందని , అంతా కలిసి పార్టీకోసం కష్టపడదామని అన్నారు. దీంతో మొత్తానికి  ‘రాజీ’ ధోరణిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది. కాగా లేఖ రాసిన సీనియర్ నేతలపై మరో నేత అంబికా సోనీ మండిపడ్డారు. వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక తాము ఏ శిక్షకైనా సిధ్దమని, ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్ పేర్కొన్నారు.తను రాజీనామాకు సిధ్దమని వఛ్చిన వార్తలపై స్పందించిన గులాం నబీ ఆజాద్.. ఇతర నేతలకు వీటిని ఆపాదించారు. హర్యానా కాంగ్రెస్ చీఫ్ కుమారి శెల్జా కూడా ఈ విధమైన ఆరోపణలు చేశారని అన్నారు.

ఏమైతేనేం ? పార్టీలో రేగిన సంక్షోభం ‘టీ కప్పులో తుపాను’ లా ప్రస్తుతానికి ముగిసింది. 20 మందికి పైగా సీనియర్ నేతలు రాసిన లేఖ తాలూకు ఛిచ్చు పైకి చల్లారినట్టే ఉన్నా.. లోలోన దాని వేడి ఇంకా పూర్తిగా అలాగే ఉన్నట్టు కనిపిస్తోంది.  ఈ లేఖపై సంతకాలు చేసినట్టు చెబుతున్న నేతలు పలువురు ఇంకా అసంతృప్తితోనే ఉన్నట్టు కనిపిస్తున్నారు. పృథ్వీ రాజ్ చవాన్, కపిల్ సిబల్,శశి థరూర్ వంటివారు ఇప్పటికీ తమ మనస్సులో ఉన్న భావనలేమిటో స్పష్టం చేయలేదు. పార్టీ ప్రక్షాళన, సమిష్టి నాయకత్వం, యువతకు ప్రాధాన్యం వంటి వారి లేఖా నినాదాలు అలాగే ఉన్నాయి.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..