Breaking News
  • ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించిన సర్వే ఆఫ్‌ ఇండియా. జమ్ము-కశ్మీర్‌ విభజన తర్వాత విడుదల చేసిన కొత్త మ్యాప్‌లో ఏపీ రాజధానిగా ఏ నగరాన్ని చూపని సర్వే ఆఫ్‌ ఇండియా. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన పత్రాల ఆధారంగా అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ కొత్తమ్యాప్‌ విడుదల చేసిన సర్వేఆఫ్‌ ఇండియా.
  • యాదాద్రి: బైక్‌ను ఢీకొన్న గూడ్స్‌ రైలు. భర్త రాంరెడ్డి మృతి, భార్య రాధకు తీవ్రగాయాలు. భువనగిరి మండలం రాయగిరి రైల్వేస్టేషన్‌ దగ్గర ఘటన.
  • పార్టీ మారతారన్న వార్తలపై స్పందించిన మంత్రి ఈటల. నేను పార్టీ మారను-మంత్రి ఈటల. గాలి వార్తలపై నేను స్పందించను. చెప్పే వాళ్లు ఎన్నైనా చెప్తారు-మంత్రి ఈటల.
  • సుజనాచౌదరి వ్యాఖ్యలకు మంత్రి మోపిదేవి కౌంటర్‌. గోడ దూకే ఎంపీలెవరూ వైసీపీలో లేరు. జగన్‌పై ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంపూర్ణ విశ్వాసం ఉంది. తిరుమలను ఆర్ధిక వనరుగా భావించే ఆలోచన ప్రభుత్వానికి లేదు -మంత్రి మోపిదేవి వెంకటరమణ.
  • ఈ ప్రపంచంలో దేనికైనా రంగులు వేయొచ్చు కష్టానికి తప్ప. అమరావతిని అంతర్జాతీయ పటంలో పెట్టింది చంద్రబాబు. అమరావతిని చేర్చి సర్వే ఆఫ్‌ ఇండియా కొత్త మ్యాప్‌ విడుదల చేసేలా లోక్‌సభలో పోరాడిన గల్లా జయదేవ్‌కు అభినందనలు-ట్విట్టర్‌లో నారా లోకేష్‌

దాన్ని భరించలేకపోయేదాన్ని.. ఆ భయం నాకెప్పుడూ ఉంటుంది

Nayanthara about controversies, దాన్ని భరించలేకపోయేదాన్ని.. ఆ భయం నాకెప్పుడూ ఉంటుంది

గత కొన్నేళ్లుగా దక్షిణాదిన టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న లేడి సూపర్‌స్టార్ నయనతార ఇటీవల ప్రముఖ వోగ్ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన జీవితం, సినిమాలకు సంబంధించిన పలు విషయాలను నయనతార వెల్లడించింది. పదేళ్లలో తాను ఎవ్వరికీ ఇంటర్వ్యూలు ఇవ్వలేదని చెప్పిన నయన్.. తాను ఆలోచించే ప్రతి విషయాన్ని ప్రపంచం తెలుసుకోవాలని అనుకోనని పేర్కొంది. చాలాసార్లు తాను చెప్పిన మాటలను తప్పుగా రాశారని.. అవన్నీ భరించలేకపోయేదానన్ని తెలిపింది. ‘‘సినిమాల్లో నటించడం మాత్రమే తన వృత్తి అని..  తానేంటో తన సినిమాలే  చెప్తాయి’’ అని నయన్ చెప్పుకొచ్చింది.

ఇక అందరిలో తాను త్వరగా కలిసిపోలేనని కూడా నయన్ వెల్లడించింది. ‘‘2011లో సినిమాలకు నేను దూరంగా ఉన్నప్పుడు.. నా సినిమాలు, పాటలు ప్రసారం అయ్య ఛానెళ్లను కూడా నేను చూడలేదు’’ అని లేడి సూపర్‌స్టార్ తెలిపింది. ‘‘వరుస సినిమాలతో నేను ఎప్పుడూ బిజీగా ఉంటాను. మంచి సినిమాను అందించలేనేమోనన్న భయం నన్ను ఎప్పుడూ వెంటాడుతుంది. అలాగే విజయాలు వస్తే దాన్ని తలకెక్కించుకోను. నేను చాలా ప్రైవేట్ పర్సన్‌ను.  అనవసరమైన అన్ని వివాదాలను స్పందించాలని కూడా నేను అనుకోను’’ అంటూ ఆమె పేర్కొంది.

Nayanthara about controversies, దాన్ని భరించలేకపోయేదాన్ని.. ఆ భయం నాకెప్పుడూ ఉంటుంది

కాగా ఈ ఏడాది నయనతార విశ్వాసం, ఐరా, మిస్టర్ లోకల్, లవ్ యాక్షన్ డ్రామా, సైరాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీటిలో ఐరా, మిస్టర్ లోకల్ మినహా మిగిలినవి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక విజయ్ సరసన ఆమె నటించిన బిగిల్(తెలుగులో విజిల్) దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీతో పాటు రజనీ సరసన దర్బార్ మూవీలో నటించగా.. అది వచ్చే ఏడాది విడుదల కానుంది.