ఆన్‌లైన్ డేటింగ్‌కి అస్సలు ఒప్పుకోను: సోనాక్షి సిన్హా

ప్రపోజ్ చేస్తే చంపేస్తానంటోంది బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా. ఎవరైనా అభిమానులు తనకు సోషల్ మీడియాలో ప్రపోజ్‌ చేయాలని చూస్తే చంపేస్తానని హెచ్చరించింది. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత, సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ షోలో సోనాక్షి ఈ మాట అన్నారు. అబ్బాయిలు ఎవరైనా సరే.. నాకు ఆన్‌లైన్‌లో ప్రపోజ్‌ చేస్తే చంపేస్తా. ఆన్‌లైన్‌ డేటింగ్‌కి నేను అస్సలు ఒప్పుకోను అని వెల్లడించింది. సినిమా హీరోయిన్లు ఎవరైనా తమ ఫోటోలు కానీ, ఇంకేదైనా […]

ఆన్‌లైన్ డేటింగ్‌కి అస్సలు ఒప్పుకోను: సోనాక్షి సిన్హా
Follow us

|

Updated on: Mar 08, 2019 | 2:12 PM

ప్రపోజ్ చేస్తే చంపేస్తానంటోంది బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా. ఎవరైనా అభిమానులు తనకు సోషల్ మీడియాలో ప్రపోజ్‌ చేయాలని చూస్తే చంపేస్తానని హెచ్చరించింది. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత, సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ షోలో సోనాక్షి ఈ మాట అన్నారు. అబ్బాయిలు ఎవరైనా సరే.. నాకు ఆన్‌లైన్‌లో ప్రపోజ్‌ చేస్తే చంపేస్తా. ఆన్‌లైన్‌ డేటింగ్‌కి నేను అస్సలు ఒప్పుకోను అని వెల్లడించింది.

సినిమా హీరోయిన్లు ఎవరైనా తమ ఫోటోలు కానీ, ఇంకేదైనా కానీ సోషల్ మీడియాలో పెట్టగానే యువకులు విపరీతంగా కామెంట్లు పెడతారన్న సంగతి తెలిసిందే. ఐ లవ్ యూ అని, బాగున్నావని, అలా ఇలా అంటూ ఉంటారు. సోనాక్షి సిన్హాకు అలాంటి కామెట్లు తప్పవు కదా.. అందుకే ఆన్‌లైన్ డేటింగ్‌కు ఒప్పుకోనని చెప్పింది.

సోనాక్షి త్వరలో ‘కళంక్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అభిషేక్‌ వర్మన్‌ తెరకెక్కిస్తున్న ఈ పీరియడ్‌ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో నటిస్తున్న ఆలియా భట్, వరుణ్‌ ధావన్‌, సంజయ్‌ దత్‌, ఆదిత్య రాయ్‌ కపూర్‌ల పాత్రలకు సంబంధించిన ఫస్ట్‌లుక్స్‌ విడుదలయ్యాయి.