Breaking News
  • బంగాళాఖాతంలోని పశ్చిమ మధ్య తీరంలో కొనసాగుతున్న అల్పపీడనం . ఒడిశా తీరం వెంబడి పయనిస్తూ బెంగాల్, బంగ్లాదేశ్ మీదుగా వెళ్లే ఛాన్స్ . అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కి.మీ.ఎత్తులో ఉపరితల ఆవర్తనం. ఈ రోజు వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం . రేపు సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం . తెలంగాణ, కోస్తాంధ్రాలో మోస్తరు వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు. మత్స్యకారులు వేటకు వెల్లొద్దు- వాతావరణశాఖ అధికారి .
  • విశాఖలో రూ.3.60 లక్షలు విలువ చేసే గుట్కా పట్టుకున్న పోలీసులు . లారీ నుంచి అన్‌లోడ్ చేస్తుండగా పట్టుకున్నాం- క్రైం డీసీపీ సురేష్‌బాబు. టూటౌన్‌, ఎమ్మార్‌పేట,ఫోర్త్‌టౌన్‌, పీఎస్ పరిధిలో రూ.3.70 కోట్లు గుట్కా స్వాధీనం . నిడమూరి వెంకటసురేష్‌కుమార్‌ను అరెస్ట్ చేశాం- క్రైం డీసీపీ సురేష్‌బాబు.
  • కృష్ణా: జగ్గయ్యపేట పీఎస్ పరిధిలో నకిలీ పోలీస్ ముఠా గుట్టురట్టు . ముగ్గురు నకిలీ పోలీసుల అరెస్ట్ . నిందితులు శివనాగేంద్ర, వీరాంజనేయులు, గోపాలకృష్ణగా గుర్తింపు. వాహనదారులను బెదిరించి డబ్బులు వసూలకు పాల్పడుతున్న ముఠా . మద్యం స్మగ్లర్లను టార్గెట్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న ముఠా .
  • అమరావతి: భారీ వర్షాలు, వరదల వల్ల రైతులు నష్టపోయారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి- పవన్‌ కల్యాణ్‌. రైతుల పెట్టుబడిని తక్షణమే ప్రభుత్వం చెల్లించాలి. గతంలో పంట నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదు. త్వరగా అంచనాలు వేసి రైతులకు పరిహారం చెల్లించాలి- పవన్ కల్యాణ్ .
  • గుంటూరు: ఒకవైపు అమరావతి, మరోవైపు మూడు రాజధానుల కోసం ఆందోళన . మూడు రాజధానులకు మద్దతుగా దళిత బహుజన పరిరక్షణ నేతల దీక్ష . తాళ్లాయపాలెం సీడ్ యాక్సెస్ రోడ్డు జంక్షన్ దగ్గర ఉద్రిక్తత . ఉద్దండరాయనిపాలెం వైపు దూసుకెళ్లేందుకు యత్నం, అడ్డుకున్న పోలీసులు . శంకుస్థాపన ప్రదేశానికి అనుమతించాలని కోరుతూ ఆందోళన. ఉద్దండరాయనిపాలెంలో అమరావతికి మద్దతుకు జేఏసీ నేతల పాదయాత్ర . పాదయాత్ర తర్వాత అనుమతిస్తామంటున్న పోలీసులు .
  • బ్రెజిల్: ఆస్ట్రాజెనికా-ఆక్స్‌ఫర్డ్ ప్రయోగ పరీక్షల్లో విషాదం . కొవిడ్ టీకాతో వాలంటీరు మృతి . మూడో దశ క్లినికల్ పరీక్షల్లో వ్యాక్సిన్ వేయించుకున్న వాలంటీరు మృతి . వాలంటీరు ఎలా మృతి చెందాడో పరిశీలిస్తున్న ఆరోగ్య విభాగం . ఆక్స్‌ఫర్ట్ వర్సిటీతో కలిసి టీకాను అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనికా. వ్యాక్సిన్‌ తదుపరి పరీక్షలను కొనసాగిస్తున్న ఆస్ట్రాజెనికా. వాలంటీరు మృతి వివరాలను సమీక్షించాం. వ్యాక్సిన్ భద్రతపై అనుమానాలొద్దు. -ఆక్స్‌ఫర్డ్ ప్రతినిధి అలెగ్జాండర్ బక్స్‌టన్ .
  • ఈనెల 9న బంగారు ఆభరణాలు స్కూటీపై తీసుకెళ్తుండగా నగలు మాయం అయిన కేసును ఛేదించిన బంజారాహిల్స్ పోలీసులు. బషీర్ బాగ్ వీఎస్ గోల్డ్ నగల దుకాణం నిర్వాహకులు జూబ్లీహి ల్స్ లోని కృష్ణ పెరల్స్ ఆభరణాల షాపు లో ఓ కస్ట మర్ కోసం ఆభరణాలు తీసుకొచ్చిన సేల్స్ మెన్. వాటిని ద్విచక్రవాహనంపై తిరిగి వీఎస్ గోల్డ్ తీసుకెళుతున్న ప్రదీప్ అనే సేల్స్ మన్ బంజారాహిల్స్ లో రోడ్డుపై వరదనీటిని లో కొట్టుకుపోయిన బ్యాగ్. స్థానికులతో కలిసి బ్యాగ్ కోసం వెతికిన క్రమంలో దొరికిన ఖాళీ బ్యాగ్. బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేసిన యజమాని. కేసు దర్యాప్తు చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. వీరినుంచి కోటి రూపాయలు బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.

మోదీకి హనుమంతుడిలాంటి వాడిని చిరాగ్‌ పాశ్వన్‌

Bihar Elections 2020, మోదీకి హనుమంతుడిలాంటి వాడిని  చిరాగ్‌ పాశ్వన్‌

బీహార్‌ ఎన్నికల్లో ఒంటరిగా పోరాటం చేస్తున్న లోక్‌ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌ చేస్తున్న వ్యాఖ్యలు అక్కడి ఓటర్లను గందరగోళంలో పడేస్తున్నాయి.. ప్రధాని నరేంద్రమోదీకి తాను వీరాభిమానిని చెప్పుకుంటున్న చిరాగ్‌ ఆయన రాముడైతే తాను హనుమంతుడిలాంటివాడినని అంటున్నారు.. డౌటేమైనా ఉంటే గుండెను చీల్చి చూపిస్తానంటున్నారు. అంత అభిమానముంటే బీజేపీతో పొత్తుపెట్టుకునే ఎన్నికల్లో పోటీ చేయవచ్చు కదా అన్నది కొందరు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు.. లోక్‌జనశక్తిని విమర్శిస్తూ మాట్లాడాలని బీజేపీ నేతలపై ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించిన చిరాగ్‌ బీహార్‌లో రాబోయేది బీజేపీ, ఎల్‌జేపీ ప్రభుత్వమేనని సంచలన వ్యాఖ్య చేశారు.. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను ఎల్‌జేపీ వ్యతిరికస్తే మోదీ, అమిత్‌షాలను కూడా వ్యతిరేకించినట్టే అవుతుందని బీజేపీ నేత, డిప్యూటీ సీఎం సుశీల్‌కుమార్‌ మోదీ అంటున్నారు. ఓట్లను చీల్చేందుకే ఎల్‌జేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆరోపించారు సుశీల్‌ మోదీ. ఎల్‌జేపీతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు. బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ కూడా ఇదే మాటన్నారు. ప్రజలను గందరగోళ పరిచే ఇలాంటి రాజకీయాలంటే తమకు నచ్చవని పేర్కొన్నారు. బీహార్‌లో కేవలం జేడీయూ, జీతన్‌రాం మాంఝీ నేతృత్వంలోని హెచ్‌ఏఎం, వికాస్‌ శీల్‌ ఇన్సాన్‌ పార్టీతో మాత్రమే తమకు పొత్తు ఉందని చెప్పారు. ఎన్నికల్లో ఓట్లు చీల్చడం తప్ప ఈ ఎన్నికల్లో లోక్‌జనశక్తి పార్టీ ప్రభావం పెద్దగా ఉండదన్నారు.

Related Tags