కేరళ క్రైమ్: ఖతర్నాక్ లేడీలో మరిన్ని కోణాలు.. అవేంటంటే..?

I am Innocent said Shaju accused along with Jolly in Koodathayi Murder case, కేరళ క్రైమ్: ఖతర్నాక్ లేడీలో మరిన్ని కోణాలు.. అవేంటంటే..?

కేరళలో.. ఆస్తి కోసం 14 ఏళ్లలో.. ఒకే కుటుంబంలో ఆరుగుర్ని చంపిన కోడలు.. జోలీ ఉదంతంలో.. కొత్త కోణాలు వెలుగుచూశాయి. ఆమె పెళ్లి చేసుకున్న రెండో భర్త షాజూను కూడా మోసం చేసిందని తెలుస్తోంది. షాజూతో వివాహేతర సంబంధం పెట్టుకున్న జోలీ.. ఆస్తికోసం అతన్ని కూడా మోసం చేసి .. చంపాలని ప్రయత్నించినట్టు తాజా సమాచారం. కాగా.. జోలీ చేసిన హత్యలకు తనకు సంబంధం లేదని.. తెలిపాడు షాజు . అలాగే.. ఇక జోలీ జైల్లో ఉంటుంది కాబట్టి.. ఆమె పిల్లల్ని కూడా తనే చూసుకుంటానని చెప్పారు షాజూ.

మర్డర్ వివరాలు: కేరళ రాష్ట్రం కోలీకోడ్‌ కూడథాయ్‌లో ఒకే కుటుంబంలో ఆరుగురు హత్యకు గురయ్యారు. భర్త సోదరుడు సాగిపై మనసుపడిన జూలీథామస్‌ 14 ఏళ్లుగా కుటుంబంలోని ఒక్కొక్కరినీ హతమారుస్తూ వచ్చింది. 2002లో అత్త అన్నమ్మ, 2008లో మామ టామ్‌ థామస్‌, 2011లో భర్త రాయ్‌థామస్‌ను సైతం హత్య చేసింది జూలీ. 2014లో సాగి భార్య పిల్లలను హతమార్చింది.

మటన్‌సూప్‌లో సైనైడ్ కలిపి ఈ దారుణాలకు ఒడిగట్టింది జూలీ. ఈ క్రమంలో భర్త సోదరుడిని జూలీ వివాహం చేసుకోవడంతో అనుమానం వచ్చిన జూలీ భర్త మేనమామ చార్లెజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ఈ దారుణ వాస్తవాలు వెలుగుచూశాయి. మృతదేహాలను వెలికితీసిన పోలీసులు వాటికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టంలో సైనైడ్ హత్యల మిస్టరీ బయటపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *