‘లక్ష్మీస్ ఎన్టీఆర్’: సెన్సార్ బోర్డ్ మీద కేసుకు సిద్ధమైన వర్మ

సెన్సార్ బోర్డ్ మీద కేసు వేయడానికి సిద్ధమౌతున్నానంటూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ షాకిచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ విడుదలకు సంబంధించి సెన్సార్ బోర్డ్ మీద కేసు వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టారు. తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను సెన్సార్ బోర్డ్ చట్ట వ్యతిరేకంగా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని వర్మ చెబుతున్నారు. ఎన్నికల తర్వాత విడుదల చేసుకోండి వర్మ చిత్రించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ మరికొద్ది రోజుల్లో విడుదలకు సిద్ధంగా […]

'లక్ష్మీస్ ఎన్టీఆర్': సెన్సార్ బోర్డ్ మీద కేసుకు సిద్ధమైన వర్మ
Follow us

| Edited By:

Updated on: Mar 17, 2019 | 3:24 PM

సెన్సార్ బోర్డ్ మీద కేసు వేయడానికి సిద్ధమౌతున్నానంటూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ షాకిచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ విడుదలకు సంబంధించి సెన్సార్ బోర్డ్ మీద కేసు వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టారు. తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను సెన్సార్ బోర్డ్ చట్ట వ్యతిరేకంగా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని వర్మ చెబుతున్నారు.

ఎన్నికల తర్వాత విడుదల చేసుకోండి

వర్మ చిత్రించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ మరికొద్ది రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే అసలు ఏం జరిగిందంటే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీని చూసి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ సెన్సార్ బోర్డుకు వర్మ అప్లికేషన్ పెట్టారు. ఏపీలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ 11వ తేదీన ఎలక్షన్ ముగిసిన అనంతరం తాము సినిమాను పరిశీలించి సర్టిఫికేట్ ఇవ్వగలమని సెన్సార్ బోర్డ్ వర్మకు సమాధానమిచ్చింది. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత సినిమాను విడుదల చేసుకోవచ్చని సూచించింది.

1952 సినిమాటోగ్రఫీ చట్టం

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కారణంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను పరిశీలించలేమని సెన్సార్ బోర్డ్ అంటోందని వర్మ అంటున్నారు. అయితే ఎన్నికల నియమావళికి, సినిమాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెబుతున్నారు. 1952 సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం ముందు సినిమాను చూసి అప్పుడు అనుమతించాలా? వద్దా? అనేది నిర్ణయించాలని సెక్షన్ 4 చెబుతోందని వర్మ వాదిస్తున్నారు. అదే చట్టంలోని సెక్షన్ 5ఏలో భారత దేశ సమగ్రతకు, సౌభ్రాతృత్వానికీ భంగం వాటిల్లే విధంగా ఏవైనా సన్నివేశాలుంటే అప్పుడు అనుమతి నిరాకరించవచ్చని ఉంది.

సెన్సార్ బోర్డుకు ఆ హక్కు లేదు

సినిమాను చూడకుండానే ఎన్నికలు ఉన్నందున పరిశీలించడం కుదరదనే హక్కు సెన్సార్ బోర్డ్‌కు లేదు. ఇది ప్రాధమిక హక్కుకు భంగం కలిగించడమేనని వర్మ చెబుతున్నారు. సినిమాలను కంట్రోల్ చేసే అధికారం భారత ఎన్నికల సంఘానికి కూడా లేదు. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులకు సంబంధించిన అంశాలను అది చూసుకుంటుంది. 2018లో పద్మావతి సినిమా విడుదల విషయంలో కూడా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వర్మ ప్రస్తావించారు. ఆ కేసులో సినిమా విడుదలకు అనుకూలంగానే న్యాయస్థానం తీర్పు చెప్పిందని వర్మ గుర్తు చేస్తున్నారు.

భావ స్వాతంత్రపు హక్కును అడ్డుకునే హక్కు ఎవరికీ లేదంటూ ఇంకొన్ని కేసులను కూడా వర్మ ప్రస్తావిస్తున్నారు. ఒక రచయిత భావ ప్రకటనను, స్వేచ్ఛగా రాసే హక్కును ఎవరూ అడ్డుకోలేరు. అందుకే తాను సెన్సార్ బోర్డుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నానని వర్మ చెప్పారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు