సస్పెన్షన్‌పై స్పందించిన పృథ్వీషా..భావోద్వేగ ట్వీట్

ముంబయి: టీమిండియా యువ క్రికెటర్‌ పృథ్వీషాకు భారీ షాక్ తగిలింది.  డోపింగ్‌ పరీక్షలో విఫలమైన అతడిపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. 8 నెలల పాటు అన్ని ఫార్మాట్ల  క్రికెట్‌ ఆడకుండా నిషేధం విధించింది. సయ్యద్‌ ముస్తాఖ్‌ అలీ ట్రోఫీలో భాగంగా ఇండోర్‌లో మ్యాచ్‌ ఆడుతుండగా అతడికి డోపింగ్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ముంబయి క్రికెట్‌ సంఘం అనుబంధ ఆటగాడైన పృథ్వీషా నమూనాల్లో  నిషేధిత ఉత్ప్రేరకాలు ఉన్నట్టు తేలింది. షా మూత్రం నమూనాల్లో  ‘టర్బుటలైన్‌’ అనే నిషేధిత […]

సస్పెన్షన్‌పై స్పందించిన పృథ్వీషా..భావోద్వేగ ట్వీట్
Follow us

|

Updated on: Jul 30, 2019 | 11:52 PM

ముంబయి: టీమిండియా యువ క్రికెటర్‌ పృథ్వీషాకు భారీ షాక్ తగిలింది.  డోపింగ్‌ పరీక్షలో విఫలమైన అతడిపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. 8 నెలల పాటు అన్ని ఫార్మాట్ల  క్రికెట్‌ ఆడకుండా నిషేధం విధించింది. సయ్యద్‌ ముస్తాఖ్‌ అలీ ట్రోఫీలో భాగంగా ఇండోర్‌లో మ్యాచ్‌ ఆడుతుండగా అతడికి డోపింగ్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ముంబయి క్రికెట్‌ సంఘం అనుబంధ ఆటగాడైన పృథ్వీషా నమూనాల్లో  నిషేధిత ఉత్ప్రేరకాలు ఉన్నట్టు తేలింది. షా మూత్రం నమూనాల్లో  ‘టర్బుటలైన్‌’ అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు  అధికారులు గుర్తించారు.  దీంతో డోపింగ్‌ నిబంధనల ఉల్లంఘన కమిటీ బీసీసీఐ ఏడీఆర్‌ ఆర్టికల్‌ 2.1 ప్రకారం అతడిపై చర్యలు తీసుకుంది.   క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయంతో సొంత గడ్డ మీద బంగ్లాదేశ్, సౌతాఫ్రికాలతో జరిగే సిరీస్‌ల్లో ఆడే అవకాశాన్ని అతడు కోల్పోయాడు.

తనపై నిషేధం వేటు విధించడం పట్ల యువ క్రికెటర్ పృథ్వీ షా స్పందించాడు. నవంబర్ మధ్య వరకు క్రికెట్ ఆడలేనని నాకు తెలిసిందన్న షా.. ‘‘ఫిబ్రవరిలో బాగా దగ్గు, జలుబు రావడంతో సిరప్ తాగాను. అందులో నిషేధిత ఉత్ప్రేరకం మోతాదులు ఉన్నాయని తేలడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. నాకు దగ్గు టానిక్ తాగేటప్పుడు నేను నిబంధనలను పాటించలేదు. నా తలరాతను అంగీకరిస్తున్నాను. ఇప్పటికీ నేను గాయంతో బాధపడుతున్నాను. సస్పెన్షన్ నిర్ణయం నాకు షాకిచ్చింది. మందులు తీసుకునే సమయంలో క్రీడాకారులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని తెలిసి వచ్చింది. ఎప్పుడూ నిబంధనలను పాటించాలి. నాకు అనునిత్యం అండగా నిలిచిన, అన్ని రకాలుగా మద్దతుగా నిలిచిన బీసీసీఐకి, నా సన్నిహితులకు ధన్యవాదాలు. క్రికెటే జీవితం. భారత్ తరఫున, ముంబై తరఫున క్రికెట్ ఆడటం కంటే నాకేదీ గొప్పది కాదు. ఈ దశ నుంచి త్వరగా, బలంగా వెనక్కి వస్తాను. మీ మద్దతుకు ధన్యవాదాలు’’ అని పృథ్వీ షా ట్వీట్ చేశాడు.

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.