వావ్… రూ. 10 లక్షలకే హ్యుందయ్ ఈ-కారు..!

ఎస్‌యూవీ విడుదలతో భారత వాహన రంగంలో కొత్త శకానికి నాంది పలికిన హ్యూందయ్ మరో అడుగు ముందుకేసింది. రూ. 10 లక్షలకే భారత్‌లో విద్యుత్ కారును అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే దీని అభివృద్ధికి రూ.2,000 కోట్లను పెట్టుబడి పెట్టనుంది. చెన్నైలోని హ్యుందయ్‌ ఫ్యాక్టరీలో ఈ వాహనాన్ని తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కారును మధ్య ఆసియా, లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా, అరబ్‌ దేశాలకు ఎగుమతి చేయాలనే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతోపాటు ఎలక్ట్రిక్ బ్యాటరీ ప్లాంట్‌ను […]

వావ్... రూ. 10 లక్షలకే హ్యుందయ్ ఈ-కారు..!
Follow us

| Edited By:

Updated on: Jul 17, 2019 | 1:25 PM

ఎస్‌యూవీ విడుదలతో భారత వాహన రంగంలో కొత్త శకానికి నాంది పలికిన హ్యూందయ్ మరో అడుగు ముందుకేసింది. రూ. 10 లక్షలకే భారత్‌లో విద్యుత్ కారును అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే దీని అభివృద్ధికి రూ.2,000 కోట్లను పెట్టుబడి పెట్టనుంది. చెన్నైలోని హ్యుందయ్‌ ఫ్యాక్టరీలో ఈ వాహనాన్ని తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కారును మధ్య ఆసియా, లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా, అరబ్‌ దేశాలకు ఎగుమతి చేయాలనే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతోపాటు ఎలక్ట్రిక్ బ్యాటరీ ప్లాంట్‌ను భారత్‌లో ప్రారంభించాలని ఆ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే సుజుకీ, టొయోటాలు సంయుక్తంగా ఇటువంటి ప్రాజెక్టును చేపట్టాయి. హ్యుందయ్‌ కూడా ఒక భాగస్వామితో కలిసి ఇటువంటి ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుందని సంస్థ ఎండీ కిమ్‌ తెలిపారు. తాము భారత్ కోసం పూర్తిగా కొత్త ఉత్పత్తిని కనుగొనడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. దీని బాడీ స్టైల్స్‌ విప్లవాత్మకంగా ఉంటాయని కిమ్ పేర్కొన్నారు.