పాతబస్తీకి మెట్రో కళ.. స్టేషన్లు ఇవే!

పాత బస్తీ వాసులకు హైదరాబాద్ మెట్రో మరో శుభవార్త చెప్పింది. కారిడార్-2లో ఎంజీబీఎస్ వరకు ఉన్న మెట్రో మార్గాన్ని.. ఓల్డ్ సిటీ వరకు పొడిగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పాతబస్తీలో ముందుగా ప్రతిపాదించిన అలైన్‌మెంట్ ప్రకారం నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని మార్పులు చేసి  కొత్త స్టేషన్లను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఓల్డ్ సిటీ మార్గంలో ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు, మందిరాలు ఉన్నాయి. అక్కడ మెట్రో నిర్మాణం జరిగితే వాటికీ ముప్పు ఏర్పడే […]

పాతబస్తీకి మెట్రో కళ.. స్టేషన్లు ఇవే!
Follow us

|

Updated on: Sep 22, 2019 | 7:43 AM

పాత బస్తీ వాసులకు హైదరాబాద్ మెట్రో మరో శుభవార్త చెప్పింది. కారిడార్-2లో ఎంజీబీఎస్ వరకు ఉన్న మెట్రో మార్గాన్ని.. ఓల్డ్ సిటీ వరకు పొడిగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పాతబస్తీలో ముందుగా ప్రతిపాదించిన అలైన్‌మెంట్ ప్రకారం నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని మార్పులు చేసి  కొత్త స్టేషన్లను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.

ఓల్డ్ సిటీ మార్గంలో ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు, మందిరాలు ఉన్నాయి. అక్కడ మెట్రో నిర్మాణం జరిగితే వాటికీ ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం అయింది. అయితే ఇప్పుడు ఏ నష్టం వాటిల్లకుండా నిర్మాణం చేపట్టనుంది ఎల్‌అండ్‌టీ సంస్థ. పాతబస్తీ రూట్‌లో మొత్తం ఐదు స్టేషన్లను ఖరారు చేసింది. సాలర్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, శంషేర్‌గంజ్, ఫలక్‌నుమా ప్రాంతాల్లో స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. తర్వగా ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని మెట్రో అధికారులు వెల్లడించారు.

దీపావళీకి రాయదుర్గం మెట్రో స్టేషన్….

ఐటీ ఉద్యోగులకు హైదరాబాద్ మెట్రో మరో శుభవార్త చెప్పింది. అక్టోబర్ 15లోపు రాయదుర్గం మెట్రో స్టేషన్ పనులు పూర్తి చేసి.. దీపావళి నాటికి ప్రయాణీకులకు అందుబాటులోకి తెస్తామని మెట్రో అధికారులు వెల్లడించారు. మెట్రో తొలి దశ ప్రాజెక్ట్‌కు నాగోల్-రాయదుర్గం కారిడార్ 3 అత్యంత కీలకమైనది. ఈ మెట్రో లైన్ పూర్తయితే లక్షలాది ఐటీ ఉద్యోగుల రవాణా సమస్య తీరిపోతుంది. అండర్ పాస్, ఫ్లై ఓవర్ల నిర్మాణం వల్ల పనులు పూర్తి కావడంలో జాప్యం ఏర్పడింది. హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు ట్రాక్, విద్యుత్ పనులు పూర్తి చేశారు. కానీ మెట్ల మార్గాలు చివరి దశలో ఉన్నాయి. నెల రోజుల్లో మిగతా పనులన్నీ పూర్తి  చేసి దీపావళీకి రాయదుర్గం స్టేషన్‌ను అందుబాటులోకి తేవాలనే టార్గెట్ పెట్టుకుంది ఎల్ అండ్ టీ.

జేబీఎస్ ట్రయిల్ రన్ షురూ…

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్(కారిడార్-2) ట్రయిల్ రన్ షురూ అయింది. అన్ని పనులు పూర్తి చేసుకుని నవంబర్‌లో ప్రయాణీకులకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే కారిడార్-2కు సంబంధించి సగం వరకు సీఎంఆర్‌ఎస్ తనిఖీలు పూర్తయ్యాయి. మిగిలిన పనులను కూడా సెప్టెంబర్ చివరివారంలోగా పూర్తి చేసి ట్రయల్ రన్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 45 రోజులపాటు ట్రయల్ రన్ పూర్తయిన అనంతరం అధికారిక ఆపరేషన్స్ నిర్వహించనున్నారు. కాగా ఈ కారిడార్ అందుబాటిలోకి రావడం వల్ల హైదరాబాద్ మెట్రో మొదటి దశ దాదాపు పూర్తవుతుంది.

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!