జీనోమ్ వ్యాలీకి పెరిగిన‌ డిమాండ్ : ఫార్మా కంపెనీల క్యూ !

హైద‌రాబాద్ నగరంలో ఫార్మా కంపెనీలు పెరగడంతో పాటు, వాటికి సంబంధించిన ఎక‌న‌మిక‌ల్ డెవ‌ల‌ప్ మెంట్ లో కూడా మార్పు క‌నిపిస్తోంది.

జీనోమ్ వ్యాలీకి పెరిగిన‌ డిమాండ్ : ఫార్మా కంపెనీల క్యూ !
Follow us

|

Updated on: Aug 04, 2020 | 10:56 PM

హైద‌రాబాద్ నగరంలో ఫార్మా కంపెనీలు పెరగడంతో పాటు, వాటికి సంబంధించిన ఎక‌న‌మిక‌ల్ డెవ‌ల‌ప్ మెంట్ లో కూడా మార్పు క‌నిపిస్తోంది. గ్లోబల్ మ్యాప్‌లో సీటీ ఫార్మా రంగం ఆర్థికంగా త‌న మార్క్ వేసే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిప్తున్నాయి. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ పెద‌, పెద్ద ఫార్మా కంపెనీల‌ను ఇప్ప‌టికే భారీగా ఆక‌ర్షించింది. యాంటీ-రెట్రోవైరల్, ఇంటర్మీడియట్‌లను సరఫరా చేయడంలో ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరున్న‌లారస్ ల్యాబ్స్, దేశంలోని అతిపెద్ద బయోఫార్మాస్యూటికల్ కంపెనీ బికాన్ యొక్క అనుబంధ సంస్థ సింజీన్ ఇంటర్నేషనల్ కంపెనీలు ఇప్ప‌టికే జీనోమ్ వ్యాలీపై ఫోక‌స్ పెట్టాయి. తాజాగా అహ్మదాబాద్ కు చెందిన ప‌లు సంస్థ‌ల‌తో పాటు ఎన్‌సిఆర్ తో క‌లిపి ఐదు సంస్థ‌లు జీనోమ్ వ్యాలీలో స్థ‌లం ద‌క్కించుకునేందుకు ముందుకు వ‌స్తున్నాయి. ఒక్కో కంపెనీ 10 నుంచి 50 ఎక‌రాల స్థ‌లం కావాల‌ని ప్ర‌పోజ‌ల్ పంపిన‌ట్టు స‌మాచారం.

కాగా పిల్ల‌ల‌కు సంబంధించిన వ్యాక్సిన్స్ విష‌యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న‌ డిమాండ్లో మూడింట ఒక వంతు హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో ఉత్పత్తి చేయబడతాయి. చెన్నై , బెంగళూరు వంటి న‌గ‌రాల‌ను ప‌క్క‌ను నెట్టి దేశంలోని ప్రధాన సైన్స్ క్లస్టర్‌గా హైద‌రాబాద్ లోని జీనోమ్ వ్యాలీ ఆవిర్భవించింది. ఇక్క‌డ ఉన్న‌ 200 ప్రధాన ఫార్మాస్యూటికల్ హబ్బుల్లో 10,000 మంది శాస్త్రవేత్తలు ప‌నిచేస్తున్నారు. జీనోమ్ వ్యాలీ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్క‌డ‌ ఎకరానికి రూ .2.5 కోట్ల భూమి రేటు ఉంది.