డెలివరీ భాయ్.. భలే ఘరమ్ గంజాయి భాయ్.. అడ్డంగా బుక్కయినా హైదరాబాద్ యువకుడు..

ఉన్నత చదువులు చదివిన ఓ యువకుడు మత్తు పదార్థాలకు బానిసై, ఉద్యోగం పోగొట్టుకొని పుడ్ డెలివరీ భాయ్‌గా మారాడు..

డెలివరీ భాయ్.. భలే ఘరమ్ గంజాయి భాయ్.. అడ్డంగా బుక్కయినా హైదరాబాద్ యువకుడు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 20, 2020 | 5:26 PM

ఉన్నత చదువులు చదివిన ఓ యువకుడు మత్తు పదార్థాలకు బానిసై, ఉద్యోగం పోగొట్టుకొని పుడ్ డెలివరీ భాయ్‌గా మారాడు.. కెనడాలో ఎం.ఎస్ పూర్తిచేసి హైదరాబాద్ ఫేస్‌బుక్‌లో ఉద్యోగం సంపాదించాడు కానీ మత్తుకు అలవాటు పడి జీవితంలో చిత్తు చిత్తుగా ఓడిపోయాడు.. చివరకు గంజాయి సప్లయ్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.. సికింద్రాబాద్ కవాడీగూడకు చెందిన బాలాజీసింగ్ ఉపాధి కోసం పుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడు.ఈ క్రమంలో ధూల్‌పేటలోని కొంతమంది గంజాయి బ్యాచ్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో వారిచ్చిన గంజాయిని గచ్చిబౌలిలోని కొంతమంది ఐటీ ఉద్యోగులు, మాదాపూర్‌‌లో ఉంటున్న విద్యార్థులకు సరఫరా చేసేవాడు.ఈ దందాలో మత్తుతో పాటు మంచి ఇన్‌కమ్‌ రావడంతో బాలాజీ దృష్టి గంజాయి స్మగ్లింగ్‌పై పడింది. దీంతో తానే గంజాయి తీసుకొచ్చి బిజినెస్ చేయాలనుకున్నాడు.నాలుగు రోజుల క్రితం విశాఖపట్నం వెళ్లి ఒకరకమైన మత్తు ద్రావణంతో పాటు గంజాయిని తీసుకొచ్చాడు. వాటిని ప్యాకెట్లలో నింపి అవసరమైన వారికి సరఫరా చేయడం మొదలెట్టాడు.. ఈ విషయం పోలీసులకు తెలియడంతో తనిఖీలు చేపట్టి బాలాజీని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడి దగ్గరి నుంచి 800 గ్రాముల మత్తు ద్రావణంతో పాటు, కిలో గంజాయి, బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు..

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..