హైదరాబాద్‌ వాసులకు ఊరట కలిగించే వార్త!!

రేపటి నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్న చల్లటివార్త చెప్పింది వాతావరణ శాఖ.. గత వారం రోజులుగా వానలు వరదలతో నానా ఇబ్బందులు పడుతూ విసుగెత్తిపోయిన నగరవాసులకు నిజంగా ఊరట కలిగించే విషయమే! మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమయ్యిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం చెబుతోంది.. రాగల 24 గంటలలో వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందంటున్నారు వాతావరణ కేంద్ర సంచాలకురాలు నాగరత్న..దీంతో వచ్చే 24 గంటలపాటు తెలంగాణ రాష్ట్రంలో […]

  • Balu
  • Publish Date - 3:28 pm, Wed, 21 October 20

రేపటి నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్న చల్లటివార్త చెప్పింది వాతావరణ శాఖ.. గత వారం రోజులుగా వానలు వరదలతో నానా ఇబ్బందులు పడుతూ విసుగెత్తిపోయిన నగరవాసులకు నిజంగా ఊరట కలిగించే విషయమే! మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమయ్యిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం చెబుతోంది.. రాగల 24 గంటలలో వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందంటున్నారు వాతావరణ కేంద్ర సంచాలకురాలు నాగరత్న..దీంతో వచ్చే 24 గంటలపాటు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నారు.. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశమందని తెలిపారు. రేపటి నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయన్నారు.. కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వచ్చే 24 గంటలలో బలపడి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయి.. ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్‌- బంగ్లాదేశ్‌ తీరంవైపుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అంటోంది..అల్పపీడన ప్రాంత ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయంటున్నారు అధికారులు. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడవచ్చంటున్నారు