లాక్‌డౌన్ ఎఫెక్ట్: హైదరాబాద్ లో లక్షకు పైగా వాహనాలు సీజ్..!

లాక్ డౌన్ ను పట్టించుకోని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్ డౌన్ ఆదేశాలను పట్టించుకోకుండా రోడ్ల పైకి వచ్చిన వాహనదారులపై చర్యలు తీసుకుంటున్నారు. మార్చ్ 23 వ తేదీ నుండి ఏప్రిల్.3 వ తేదీ వరకు రోడ్లపైకి వచ్చిన టూవీలర్ వాహనాలు 134107. త్రీ వీలర్ వాహనాలు 3360. ఫోర్ వీలర్ వాహనాలు 7958. మొత్తం 146258 వాహనాలు సర్వైవలెన్స్ కెమెరాల ద్వారా గుర్తించి ట్రాఫిక్ పోలీసులు […]

లాక్‌డౌన్ ఎఫెక్ట్: హైదరాబాద్ లో లక్షకు పైగా వాహనాలు సీజ్..!
Follow us

| Edited By:

Updated on: Apr 03, 2020 | 11:04 PM

లాక్ డౌన్ ను పట్టించుకోని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్ డౌన్ ఆదేశాలను పట్టించుకోకుండా రోడ్ల పైకి వచ్చిన వాహనదారులపై చర్యలు తీసుకుంటున్నారు. మార్చ్ 23 వ తేదీ నుండి ఏప్రిల్.3 వ తేదీ వరకు రోడ్లపైకి వచ్చిన టూవీలర్ వాహనాలు 134107. త్రీ వీలర్ వాహనాలు 3360. ఫోర్ వీలర్ వాహనాలు 7958. మొత్తం 146258 వాహనాలు సర్వైవలెన్స్ కెమెరాల ద్వారా గుర్తించి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరందిరిపై వయోలేషన్ ఆక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు ట్రాఫిక్ పోలీసులు స్వయంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ లో సరైన కారణం లేకుండా రోడ్లపైకి వచ్చిన. టూవీలర్ వాహనాలు 18268. త్రీ వీలర్ వాహనాలు 2238. ఫోర్ వీలర్ వాహనాలు 1587. మొత్తం 22178 మంది వాహనదారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.