సన్ రైజర్స్ ఓపెనర్ల సెంచరీల మోత

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో పరుగుల వరద పారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు చెలరేగిపోయారు. సన్‌రైజర్స్‌ ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌స్టో బెంగళూరు బౌలర్లను ఊచకోత కోశారు. ఇద్దరూ సెంచరీల మోత మోగించగా..  సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 231 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ క్రమంలో దొరికిన బంతిని దొరికినట్లు ఆడుకున్నారు. బెయిర్‌స్టో 52 బంతుల్లో, […]

సన్ రైజర్స్ ఓపెనర్ల సెంచరీల మోత
Follow us

|

Updated on: Mar 31, 2019 | 6:23 PM

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో పరుగుల వరద పారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు చెలరేగిపోయారు. సన్‌రైజర్స్‌ ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌స్టో బెంగళూరు బౌలర్లను ఊచకోత కోశారు. ఇద్దరూ సెంచరీల మోత మోగించగా..  సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 231 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ క్రమంలో దొరికిన బంతిని దొరికినట్లు ఆడుకున్నారు. బెయిర్‌స్టో 52 బంతుల్లో, వార్నర్ 54 బంతుల్లో సెంచరీలు చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 185 పరుగులు జోడించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇది అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం విశేషం. అంతేకాక.. సన్‌రైజర్స్‌ జట్టుకు ఇదే అత్యధిక భాగస్వామ్యం. చాహల్ వేసిన 17వ ఓవర్ 2వ బంతికి బెయిర్‌స్టో ఉమేశ్‌ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన విజయ్ శంకర్ 9పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత వార్నర్‌ దూకుడుతో ఆడి.. 55 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సలుతో 100 పరుగులు చేశాడు.