హైదరాబాద్ జట్టు మెరుపులు..

ఈ క్రమంలోనే ఆఫ్ సెంచరీ దిశగా వెళ్తున్న వార్నర్..‌ అమిత్‌ మిశ్రా బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన మనీష్‌ పాండే కేవలం మూడు పరగులు చేసి నిరాశపరిచాడు. అతడు కూడా మిశ్రా బౌలింగ్‌లోనే రబాడ చేతికి చిక్కి ఔటయ్యాడు. దీంతో హైదరాబాద్‌ 92 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది.

హైదరాబాద్ జట్టు మెరుపులు..
Follow us

|

Updated on: Sep 29, 2020 | 10:27 PM

అబుదాబి వేదికగా ఢిల్లీతో జరుగుతున్న మూడో టీ20లో హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగలిగింది. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌(45/ 33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు), జానీ బెయిర్‌స్టో(54/ 48 బంతుల్లో 2 బౌండరీలు, 1 సిక్సు)తో శుభారంభం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించారు.

ఈ క్రమంలోనే ఆఫ్ సెంచరీ దిశగా వెళ్తున్న వార్నర్..‌ అమిత్‌ మిశ్రా బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన మనీష్‌ పాండే కేవలం మూడు పరగులు చేసి నిరాశపరిచాడు. అతడు కూడా మిశ్రా బౌలింగ్‌లోనే రబాడ చేతికి చిక్కి ఔటయ్యాడు. దీంతో హైదరాబాద్‌ 92 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది.

తర్వాత వచ్చిన కేన్‌ విలియ్సమన్‌ 41/ 26 బంతుల్లో 5 ఫోర్లతో మెరుపు బ్యాటింగ్‌ చేశాడు. చివర్లో బెయిర్‌ స్టోతో కలిసి ధాటిగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. రబాడ వేసిన 18వ ఓవర్‌ ఐదో బంతికి అనూహ్య షాట్‌ ఆడిన బెయిర్‌స్టో.. నోర్జే చేతికి దొరికిపోయాడు. దీంతో వార్నర్‌ టీమ్‌ 144/3తో నిలిచింది.

చివరలో అబ్దుల్‌ సమద్‌(12/ 7) వీలైనన్ని పరుగులు చేయగలిగాడు. ఇక ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో విలియమ్సన్‌ భారీ షాట్‌ ఆడబోయి బౌండరీ వద్ద అక్షర్‌ పటేల్‌ చేతికి చిక్కాడు. ఈ ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులే రావడంతో హైదరాబాద్‌ స్కోర్‌ 162కే పరిమితమైంది. దీంతో ఢీల్లీ జట్టు ముందు 163 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగారు.

అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..

గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?

ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే

హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల

క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు

దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..

'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్