కరోనా చికిత్సకోసం గుర్రాల యాంటీ బాడీలు ! వినూత్న ట్రయల్స్ !

కరోనా వ్యాధి చికిత్సలో ఉపయోగపడే వ్యాక్సీన్  ని ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు అప్పుడే ఒక వ్యక్తిని ఎంపిక చేసుకున్న హైదరాబాద్ యూనివర్సిటీ రీసెర్చర్లు.. తాజాగా మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నారు.

కరోనా చికిత్సకోసం గుర్రాల యాంటీ బాడీలు ! వినూత్న ట్రయల్స్ !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 16, 2020 | 1:22 PM

కరోనా వ్యాధి చికిత్సలో ఉపయోగపడే వ్యాక్సీన్  ని ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు అప్పుడే ఒక వ్యక్తిని ఎంపిక చేసుకున్న హైదరాబాద్ యూనివర్సిటీ రీసెర్చర్లు.. తాజాగా మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నారు. గుర్రాల నుంచి సేకరించిన యాంటీ బాడీలను కరోనా రోగుల ట్రీట్ మెంట్ కోసం వాడవచ్చా అన్న పరిశోధనకు వారు పూనుకొన్నారు. ఇందుకు వారు సిటీలోని సెంటర్ ఫర్ మాలిక్యులర్ బయాలజీతోను, ‘విన్స్ బయో ప్రాడక్ట్స్ లిమిటెడ్’ కంపెనీతోను కలిసి రీసెర్చ్ చేయనున్నారు. కోవిడ్-19 పాండమిక్ తక్షణ చికిత్సకు సంబంధించి యాంటీ బాడీ  వ్యవస్థలతో కూడిన ఇమ్యునోథెరపీని అభివృధ్ది చేసే యోచనలో తాము ఉన్నట్టు ఈ బృందం పేర్కొంది.

ఇప్పటికే కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న రోగుల నుంచి ప్లాస్మాను సేకరించి  విషమ స్థితిలో ఉన్న రోగులకు ఇవ్వడం ద్వారా వారిలో రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రీసెర్చర్ల టీమ్ మరో ముందడుగు వేసి గుర్రాలు, ఇతర జంతువుల నుంచి యాంటీబాడీలను సేకరించి దాన్ని కరోనా రోగుల చికిత్సలో వినియోగించే అవకాశాలను పరిశీలిస్తోంది. ఇనాక్టివేట్ చేసిన కరోనా వైరస్ ని గుర్రాలకు ఇఛ్చినప్పుడు అవి యాంటీ బాడీలను ఉత్పత్తి చేస్తాయని, ఇవి కరోనా ట్రీట్ మెంట్ కి తోడ్పడతాయని భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని జంతువుల నుంచి సేకరించిన యాంటీబాడీలను ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో వినియోగిస్తున్నారు. స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ లోని ఎనిమల్ బయాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ నూరుద్దీన్ ఖాన్, మాలిక్యులర్ వైరాలజీ స్పెషలిస్ట్ డా.కృష్ణన్ హరినివాస్ తమ బృందంతో కలిసి కరోనా చికిత్సలో గుర్రాల యాంటీ బాడీల వినియోగంపై పరిశోధనలు సాగిస్తున్నారు.