రాజధానిలో బారికేడ్ల తొలగింపు.. పూర్తి స్థాయిలో రోడ్డుపైకి వాహనాలు..!

Hyderabad roads turn busy: కోవిద్-19 మహమ్మారి కట్టడికోసం చాల దేశాలు లాక్ డౌన్ లో ఉండిపోయాయి. అయితే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్ డౌన్ సడలింపులతో.. దాదాపు 60 రోజుల తరువాత హైదరాబాద్ తిరిగి మామూలు స్థితికి వచ్చినట్టుగా బుధవారం ఉదయం కనిపించింది. రోడ్ల కూడళ్ల వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు, చెక్ పోస్టులు తొలగిపోయాయి. వీధుల్లోని షాపులన్నీ తెరచుకున్నాయి. వేల సంఖ్యలో కార్లు, బైక్ లు బయటకు రావడంతో, అన్ని సిగ్నల్స్ వద్ద […]

రాజధానిలో బారికేడ్ల తొలగింపు.. పూర్తి స్థాయిలో రోడ్డుపైకి వాహనాలు..!
Follow us

| Edited By:

Updated on: May 20, 2020 | 1:03 PM

Hyderabad roads turn busy: కోవిద్-19 మహమ్మారి కట్టడికోసం చాల దేశాలు లాక్ డౌన్ లో ఉండిపోయాయి. అయితే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్ డౌన్ సడలింపులతో.. దాదాపు 60 రోజుల తరువాత హైదరాబాద్ తిరిగి మామూలు స్థితికి వచ్చినట్టుగా బుధవారం ఉదయం కనిపించింది. రోడ్ల కూడళ్ల వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు, చెక్ పోస్టులు తొలగిపోయాయి. వీధుల్లోని షాపులన్నీ తెరచుకున్నాయి. వేల సంఖ్యలో కార్లు, బైక్ లు బయటకు రావడంతో, అన్ని సిగ్నల్స్ వద్ద భారీగా ట్రాఫిక్ కనిపిస్తోంది.

కాగా.. ట్రాఫిక్ నిబంధనలనూ విధిగా పాటించాలని.. ప్రతి ఒక్కరూ మాస్క్ ను ధరించడం తప్పనిసరని.. మాస్క్ లేకుంటే రూ. 1000 జరిమానా విధిస్తామని పోలీసులు తెలిపారు. ఏ వాహనంలో ప్రయాణించినా, వాహనానికి సంబంధించిన పత్రాలన్నింటినీ దగ్గర ఉంచుకోవాలని, సాయంత్రం 7 గంటల వరకే సడలింపులు ఉంటాయని స్పష్టం చేశారు. ఆ తరువాత బయట తిరిగే వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు.

Also Read: ఏపీలో రేపటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల హాజరు తప్పనిసరి..