Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 22 వేల 771 మంది వైరస్​ సోకింది. మరో 442 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,48,315. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 2,35,433. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 3,94,227. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 18,655.
  • తెలంగాణలో ప్రజా ప్రతినిధులను వణికిస్తున్న కరోనా. ప్రగతి భవన్‌లో 30మందికిపైగా సిబ్బందికి కరోనా మరో 15రోజులపాటు ప్రగతి భవన్‌కు సీఎం దూరం. నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా- కోలుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు. యశోదలో చికత్స పొందుతున్న మహిళా ఎమ్మెల్యే. డిశ్చార్చి అయిన రాష్ట్ర హోంమంత్రి. హోం క్వారెంటైన్‌లోనే డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు. కరోనా వచ్చిన వెల్లడించని ఐదుగురికిపైగా ఎమ్మెల్యేలు. హోంక్వారైంట్‌న్‌లో చికిత్స.
  • నిమ్స్ డైరెక్టర్ మనోహర్. నిమ్స్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఐసీఎంఆర్ వాక్సిన్ ట్రయిల్ నిమ్స్ అసూపత్రిని ప్రకటించారు. 7వ తేదీ నుంచి క్లినిక్ ల ట్రయిల్ ప్రారంభిస్తాం. ఫేస్ 1,ఫేస్ 2 కిందా నిమ్స్ ఆసుపత్రిలో ఈ క్లినిక్ ల ట్రైల్స్ జరుగుతాయి. క్లినిక్ ల ట్రయిల్ భాగస్వామ్యం కావడం కోసం ముందుకు వస్తున్నారు,నిన్నటి నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయ్. వాక్సిన్ తీసుకొనే వారి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరిశీలిస్తాం. పరిశీలించిన తరవాత పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి వాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. మొదటి ఫేస్ 28 రోజులు ఉంటుంది . వాక్సిన్ ఇచ్చిన తర్వాత 2 రోజులు ఆసుపత్రి అడ్మిట్ చేస్తాం ,ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తాం.
  • నల్లగొండ: రాంగోపాల్ వర్మ నిర్మించబోయే మర్డర్ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి బాలస్వామి. సినిమా తన కొడుకు హత్య కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టులో ఆయన ఫిర్యాదు దాఖలు .దీనిపై స్పందించిన ఎస్సీ ఎస్టీ కోర్టు. రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులను ఆదేశించిన ఎస్సీ ఎస్టీ కోర్టు.
  • యాదాద్రి: ప్రభుత్వ విప్ గొంగిడి సునీత భర్త, నల్గొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డికి కరోనా పాజిటివ్. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చేసిన టెస్టుల్లో కరోనా పాజిటివ్ వచ్చిందని నిర్ధారించిన డాక్టర్లు. నిన్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు, ఇద్దరు డ్రైవర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ.
  • విజయవాడ: వైసీపీ యం.పి రఘురామకృష్ణ రాజు కామెంట్స్. అమరావతి అనేది రాష్ట్రానికి మధ్యలో ఉండటమే కాకుండా మంచి రాజధాని. ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణచేయాలని భావించడం సమంజసం కాదు. అమరావతిలో అన్ని మౌలిక సదుపాయాలు ఉండి ప్రభుత్వం అక్కడనుండే నడుస్తున్నతరుణంలో మూడు ముక్కలు చేయడం అనేది అన్యాయం. అమరావతి అనేది ఏకైక రాజదానిగా ఉండాలి.. న్యాయమైన డిమాండ్ కోసం పోరాటం చేయడం సమంజసం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వం లో అమరావతి రైతలకు ఇచ్చిన హామీలను కొనసాగించాలి. ఇది పార్టీ నిర్ణయం కాదు ప్రభుత్వం నిర్ణయం. కరోనా తరువాత వచ్చే ఆర్థిక పరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆలోచనలు మేరకు నడవాలి.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం.. నాలాలో కొట్టుకుపోయిన వ్యక్తి..

Heavy Rains In Hyderabad, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం.. నాలాలో కొట్టుకుపోయిన వ్యక్తి..

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. జనాలు రోడ్ల పైకి రావాలంటే జంకుతున్నారు. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు, కాలనీలు జలమయం అయ్యాయి. నాలాలు ఉప్పొంగి వరద నీరు రోడ్ల పైకి చేరడంతో.. రోడ్లు చెరువులను తలపించాయి. దీంతో హహనదారులు ఎటూ కదల్లేక గంటలపాటు రోడ్ల పైనే ఉండిపోయారు. వర్షం కారణంగా మధ్యాహ్నమే చీకట్లు కమ్ముకుంటున్నాయి. హైదరాబాద్‌లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎర్రగడ్డ, ఎస్ ఆర్ నగర్, మూసాపేట, ఖైరతాబాద్, కోఠి, ఉప్పల్, కూకట్ పల్లి ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షం కారణంగా నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వర్షాలకు నగరంలోని హోర్డింగులు, పాత భవనాలు ఎక్కడ కూలుతాయోనని భయపడుతున్నారు. ఫెక్సీలు చిరగడం, హోర్టింగులు పడకుండా జీహెచ్ఎంసీ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక మెట్రో ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

వర్షాల కారణంగా ప్రధాన రహదారులు సైతం చెరువులను తలపించాయి. నగరవ్యాప్తంగా మొత్తం 14 చెట్లు నేలకొరిగాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మేయర్ బొంతు రామ్మోహన్ పరిస్థితిని పర్యవేక్షించారు. నగరంలో 42 ప్రాంతాల్లో నీటి నిల్వలు ఉన్నట్లు గుర్తించామని ఆయన చెప్పారు. మాన్ సూన్ ఎమర్జెన్సీ, డిజాస్టర్ రెస్క్యూ బృందాలు నీటినీ క్లియర్ చేస్తున్నామని అన్నారు. వరద ఉధృతికి పలు వాహనాలు కొట్టుకుపోయాయి. బీజేఆర్ నగర్, సత్తిరెడ్డి కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇక ఎర్రగడ్డ ప్రేమ్ నగర్‌లోనూ అదే పరిస్థితి.

వర్షం ధాటికి రోడ్ల పై నీరు చేరడంతో నాగోల్ ఆదర్శ్‌నగర్‌లో నాలాలో ఓ వ్యక్తి పడిపోయాడు. దీంతో వెంటనే సమాచారం అందుకున్న ఎన్‌ఫోర్స్‌‌మెంట్ విభాగం సిబ్బంది హుటాహుటిన వచ్చి నాలాలో కొట్టుకుపోయిన అతన్ని కాపాడారు. అయితే నాలాలో వర్షపు నీటిని తాగి ఆ వ్యక్తి స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు.

Related Tags