వర్షం రాకతో.. మెట్రోకు ఎగబడుతోన్న జనం..!

హైదరాబాద్, సికింద్రాబాద్‌లో భారీ వర్షం పడుతోంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ముందే అప్రమత్తమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు చేపట్టారు. అరగంట ముందే చీకట్లు అలుముకున్నాయి. విడతల వారీగా ఆఫీసుల నుంచి ఉద్యోగులు ఇంటికి వెళ్లాలని జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ట్రాఫిక్ జాం కాకుండా పోలీసులు రంగంలోకి దిగారు. కుంభవృష్టి వర్షాలతో.. హైదరాబాద్‌ అతలాకుతలమవుతోంది. అసలే ఇరుకైన నగరం.. […]

వర్షం రాకతో.. మెట్రోకు ఎగబడుతోన్న జనం..!
Follow us

| Edited By:

Updated on: Sep 25, 2019 | 9:27 PM

హైదరాబాద్, సికింద్రాబాద్‌లో భారీ వర్షం పడుతోంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ముందే అప్రమత్తమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు చేపట్టారు. అరగంట ముందే చీకట్లు అలుముకున్నాయి. విడతల వారీగా ఆఫీసుల నుంచి ఉద్యోగులు ఇంటికి వెళ్లాలని జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ట్రాఫిక్ జాం కాకుండా పోలీసులు రంగంలోకి దిగారు.

కుంభవృష్టి వర్షాలతో.. హైదరాబాద్‌ అతలాకుతలమవుతోంది. అసలే ఇరుకైన నగరం.. భారీ వర్షాలతో.. ఫుల్‌గా ట్రాఫిక్ జామ్‌ అవుతోంది. దీంతో.. చేసేది ఏమీ లేక.. జనాలు మెట్రో బాట పట్టారు. కళ్లు మూసుకుని తెరిచేలోగా.. గమ్యస్థానాలకు చేరిపోతున్నారు. రోడ్డుపై ట్రాఫిక్ జామ్‌తో గంట కుస్తీ పడే వాహనదారులు.. 20 నిమిషాల్లో ఇళ్లకు చేరుకుంటున్నారు. ఒక రకంగా చూస్తే ఇదే బెటర్ కూడా. అయితే.. జనాల రాకతో.. మెట్రో ట్రైన్స్‌ కిక్కిరిసిపోయాయి. అయితే.. జనం రద్దీతో.. ఓ మెట్రో రైలు 40 నిమిషాల పాటు అక్కడే నిలిచిపోయింది. దాంతో.. ఎల్బీనగర్ టూ అమీర్‌పేట రూట్‌లో మెట్రో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. అందులోనూ భారీ వర్షంతో.. మెట్రో ట్రాక్స్‌పై ఫుల్లుగా వరద నీరు చేరింది.

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు
CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు
ఇద్దరే ఇద్దరూ.. పంజాబ్‌తో మ్యాచ్ రోహిత్ కు చాలా స్పెషల్..
ఇద్దరే ఇద్దరూ.. పంజాబ్‌తో మ్యాచ్ రోహిత్ కు చాలా స్పెషల్..
బుల్లెట్‌ ట్రైన్‌లో బుస్ బుస్.. కట్ చేస్తే ఉన్నపళంగా ఉరుకో ఉరుకు
బుల్లెట్‌ ట్రైన్‌లో బుస్ బుస్.. కట్ చేస్తే ఉన్నపళంగా ఉరుకో ఉరుకు
బాక్సాఫీస్‏ను షేక్ చేసిన హీరోయిన్.. ప్రియుడి ఇంటి ముందు శవమై..
బాక్సాఫీస్‏ను షేక్ చేసిన హీరోయిన్.. ప్రియుడి ఇంటి ముందు శవమై..
అరటి తొక్కతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఇలాంటి సమస్యలకు చెక్‌
అరటి తొక్కతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఇలాంటి సమస్యలకు చెక్‌
మీ కళ్లను మాయచేసే చిత్రం.. ఈ ఫోటోలో జింకను కనిపెట్టగలరా
మీ కళ్లను మాయచేసే చిత్రం.. ఈ ఫోటోలో జింకను కనిపెట్టగలరా
కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్.. ఏమన్నారంటే..
కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్.. ఏమన్నారంటే..
వేసవిలో పెరుగు చద్దన్నం టై చేసి చూడండి.. అమ్మమ్మకాలం నాటి రెసిపీ
వేసవిలో పెరుగు చద్దన్నం టై చేసి చూడండి.. అమ్మమ్మకాలం నాటి రెసిపీ
హెల్త్ ఇన్సూరెన్స్‌ ఉన్నవారికి శుభవార్త.. నిబంధనలలో మార్పులు
హెల్త్ ఇన్సూరెన్స్‌ ఉన్నవారికి శుభవార్త.. నిబంధనలలో మార్పులు