కుంగిన పురానాపూల్ దగ్గర వంతెన.. రాకపోకలు నిలిపివేత

400 ఏళ్ల పైచిలుకు నాటి హైదరాబాద్ లోని పురానాపూల్ బ్రిడ్జి ఇటీవలి వర్షాలకు, ఉధృతమైన వరద ప్రవాహానికి తీవ్రమైన ఒత్తిడికి లోనైంది. అయితే, ఆ ప్రాంతంలో ఉన్న కాంక్రీట్ పాత వంతెన పిల్లర్ ఈ వరద ఉధృతికి కుంగిపోయింది.  దీంతో హుటాహుటీన పోలీసులు బ్రిడ్జిమీద రాకపోకల్ని నిలిపివేశారు. మరమ్మత్తుల అనంతరం రాకపోకల్ని పునరుద్దరించే అవకాశం ఉంది. అటు, పురానాపూల్ బ్రిడ్జిని కూడా అధికారులు పనిలో పనిగా సమీక్షిస్తున్నారు.  కుతుబ్ షాహీలు నిర్మించిన అద్భుత కట్టడాల్లో ఇదీ ఒకటి. […]

కుంగిన పురానాపూల్ దగ్గర వంతెన.. రాకపోకలు నిలిపివేత
Follow us

|

Updated on: Oct 19, 2020 | 10:19 AM

400 ఏళ్ల పైచిలుకు నాటి హైదరాబాద్ లోని పురానాపూల్ బ్రిడ్జి ఇటీవలి వర్షాలకు, ఉధృతమైన వరద ప్రవాహానికి తీవ్రమైన ఒత్తిడికి లోనైంది. అయితే, ఆ ప్రాంతంలో ఉన్న కాంక్రీట్ పాత వంతెన పిల్లర్ ఈ వరద ఉధృతికి కుంగిపోయింది.  దీంతో హుటాహుటీన పోలీసులు బ్రిడ్జిమీద రాకపోకల్ని నిలిపివేశారు. మరమ్మత్తుల అనంతరం రాకపోకల్ని పునరుద్దరించే అవకాశం ఉంది.

అటు, పురానాపూల్ బ్రిడ్జిని కూడా అధికారులు పనిలో పనిగా సమీక్షిస్తున్నారు.  కుతుబ్ షాహీలు నిర్మించిన అద్భుత కట్టడాల్లో ఇదీ ఒకటి. అంతేకాదు హైదరాబాద్‌నగరంలో నిర్మించిన తొలి వంతెన కూడ ఇదే. అయితే, ఇప్పటికీ ఈ కట్టడం నగరవాసులకు సేవలందిస్తుండటం విశేషం. మూసి వరదలకు 1820 లో ఈ వంతెన కొద్దిగా దెబ్బతింది. దీంతో అప్పటి నవాబ్ సికిందర్ షా మరమ్మతులు చేయించాడు. ఆ తర్వాత 1908 లో మూసి వరదల తర్వాత కొద్దిబాగాన్ని మరమ్మతు చేశారు. ప్రస్తుతం వచ్చిపడ్డా భారీ వరదలకు మరోసారి బ్రిడ్జి పటుత్వాన్ని  సమీక్షిస్తున్నారు.