దిశ కేసులో కొత్త ట్విస్ట్.. 50 మంది సాక్షులతో..

వెటర్నరీ డాక్టర్ దిశ కేసులో మరిన్ని కొత్త విషయాలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. ఇక ఈ నెలాఖరులోగా ఛార్జ్‌షీట్ వేసేందుకు సైబరాబాద్ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే డీఎన్‌‌ఏ రిపోర్ట్స్, ఫోరెన్సిక్ నివేదికలను తెప్పించుకున్న పోలీసులు.. సుమారు 50 మందికిపైగా సాక్షులు దిశ కేసులో ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్ కీలక ఆధారమంటున్న అధికారులు.. అన్ని వివరాలను ఛార్జ్ షీట్‌లో పొందుపరుస్తామన్నారు. ఇక పోలీసులు ఛార్జ్ షీట్ వేసిన తర్వాతే.. కోర్టు […]

దిశ కేసులో కొత్త ట్విస్ట్.. 50 మంది సాక్షులతో..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 16, 2019 | 11:12 AM

వెటర్నరీ డాక్టర్ దిశ కేసులో మరిన్ని కొత్త విషయాలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. ఇక ఈ నెలాఖరులోగా ఛార్జ్‌షీట్ వేసేందుకు సైబరాబాద్ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే డీఎన్‌‌ఏ రిపోర్ట్స్, ఫోరెన్సిక్ నివేదికలను తెప్పించుకున్న పోలీసులు.. సుమారు 50 మందికిపైగా సాక్షులు దిశ కేసులో ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్ కీలక ఆధారమంటున్న అధికారులు.. అన్ని వివరాలను ఛార్జ్ షీట్‌లో పొందుపరుస్తామన్నారు.

ఇక పోలీసులు ఛార్జ్ షీట్ వేసిన తర్వాతే.. కోర్టు విచారణ చేపట్టి అవకాశం ఉంది. కాగా, ఇప్పటికే నిందితుల మృతదేహాలను గాంధీ ఆసుపత్రిలో భద్రపరిచిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్‌హెచ్ఆర్‌సీ బృందం ఈ కేసుపై దర్యాప్తు చేపడుతుండటంతో.. డెడ్ బాడీస్ కుళ్ళిపోకుండా ప్రత్యేక ఇంజెక్షన్లు ద్వారా ఎంబాల్మింగ్ చేయనున్నారు.