Breaking News
  • దేశవ్యాప్త కోవిడ్-19 గణాంకాలు: 24 గంటల వ్యవధిలో నమోదైన కొత్త కేసులు: 93,337. దేశవ్యాప్త మొత్తం కేసుల సంఖ్య: 53,08,015. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్త మరణాలు: 1,247. దేశవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య: 85,619. 24 గంటల్లో డిశ్చార్జయినవారి సంఖ్య: 95,880. దేశవ్యాప్తంగా డిశ్చార్జయిన మొత్తం కేసులు: 42,08,431. దేశవ్యాప్తంగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య: 10,13,964.
  • దేశంలో అల్-ఖైదా ఉగ్రవాదుల కుట్ర భగ్నం. కుట్రను భగ్నం చేసిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. కేరళ, బెంగాల్ సహా దేశవ్యాప్తంగా 11 ప్రదేశాల్లో ఎన్ఐఏ దాడులు. దాడుల్లో 9 మంది ఉగ్రవాదులు అరెస్ట్. బెంగాల్‌లో 6గురు, కేరళలో ముగ్గురు అరెస్ట్. మారణాయుధాలు, డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్లు, జిహాదీ సాహిత్యం లభ్యం. ఇంట్లో తయారుచేయగలిగే బాంబులు, వాటికి సంబంధించిన సమాచారం స్వాధీనం. భారీగా ప్రాణనష్టం కల్గించే ఉగ్రవాద చర్యలకు కుట్ర. దేశ రాజధాని సహా ఏకకాలంలో పలు ప్రాంతాల్లో దాడులు జరపాలని పన్నాగం.
  • ఆరోగ్య శాఖ మంత్రి ఇ ఈటెల రాజేందర్ పేషీలో ఏడుగురికి సోకిన కరోనా. మంత్రి చుట్టూ ఉండే సిబ్బంది మొత్తానికి సోకిన వైరస్. ఇద్దరు పీఏ లు, ముగ్గురు గన్మెన్లు, ఇద్దరు డ్రైవర్లకు కరోనా. ప్రతి రెండు వారాలకు తన సిబ్బందికి టెస్టు చేయిస్తున్న మంత్రి. BRK భవన్ లో ఒక్కరోజే 13 మందికి పాజిటివ్.
  • తెలంగాణ కరోనా కేసుల అప్డేట్స్: తెలంగాణ లో వేయి దాటినా కరోనా మరణాలు. తెలంగాణలో ఒకరోజు టెస్ట్ లో సంఖ్య 54459. తెలంగాణ లో కరోనా టెస్టింగ్స్ :2445409. రాష్ట్రంలో ఈరోజు పాజిటివ్ కేసులు : 2123. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు : 169169. జిహెచ్ఎంసి లో కరోనా కేసులు సంఖ్య : 305. జిహెచ్ఎంసి లో మొత్తం కరోనా కేసులు సంఖ్య : 56982. కరోనా తో ఈరోజు మరణాలు : 10. ఇప్పటి వరకూ మరణాలు మొత్తం : 1025. చికిత్స పొందుతున్న కేసులు : 30636. ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్చి అయిన వారు: 2151. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య: 137508.
  • అమరావతి : టీడీపీకి విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ గుడ్ బై. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలవనున్న వాసుపల్లి. మధ్యాహ్నం 12:30 కి సీఎం తో అపాయింట్మెంట్ . వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బాటలో వైసీపీ కి మద్దతు తెలిపే అవకాశం.
  • సుమేధ కేసులో పోలీసులకు అందిన పోస్టుమార్టం రిపోర్ట్: సైకిల్ పై తొక్కుతూ నాల లో పడిపోయిన సుమేధ. కింద పడిపోగానే తలకు బలమైన గాయం. తలకు బలమైన గాయం కావడంతో అపస్మారక స్థితిలో కి వెళ్ళింది. నాల లో పడి పోవడంతో నీళ్లు తాగింది. దీంతో శరీరంలో మొత్తం నీరు చేరి ఉబ్బిపోయింది. ఊపిరితిత్తులలోకి నీరు చేరడంతో శ్వాస ఆడక చనిపోయింది సుమేధ.

ఫోన్ చేస్తే.. ఉచిత వాహనం..!

Free Vehicle for Women Safety, ఫోన్ చేస్తే.. ఉచిత వాహనం..!

మహిళల భద్రత కోసం పోలీసులు మరో ముందడుగు వేశారు. ఆడవాళ్లు ఏదైనా పని మీద.. రాత్రి ఇంటికి వెళ్లడం లేట్ అయినా.. లేక బస్సు దొరక్క ఇబ్బంది పడినా.. ఓ ఫోన్ చేస్తే చాలు.. పోలీస్ వాహనం మీ ముందు నిలుస్తుంది. అది కూడా.. ఉచితంగా.. సేఫ్‌గా ఇంటి వద్ద డ్రాప్ చేస్తారట. అయితే.. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వార్త.. సోషల్ మీడియాలో ఫుల్‌గా వైరల్ అవుతోంది. ‘దిశ’ హత్యాచారం కేసు తర్వాత అటు పోలీసులు.. ఇటు మహిళలు పలు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ముఖ్యంగా పోలీసులు.. మహిళల భద్రత కోసం.. ప్రత్యేకమైన యాప్‌లు, ఫోన్ నెంబర్లను కేటాయించారు. అంతేకాకుండా.. ఓ సపరేట్ టీం కూడా వీటిని పర్యవేక్షిస్తుందని అధికారులు తెలియజేశారు.

దిశ ఘటన తర్వాత.. నైట్‌ టైం లేడీస్.. ఇబ్బందులు పడుతుండటంతో.. పోలీసులు ఉచిత రైడ్ స్కీమ్‌ని ప్రారంభించారు. రాత్రి 10 నుంచి 6 గంటల మధ్య రాత్రి ఒంటిరిగా ఇంటికి వెళ్లటానికి.. వాహనం దొరకని మహిళలు.. పోలీస్ హెల్ప్‌ లైన్ నెంబర్లకు 1091, 7837018555‌కి కాల్ చేసి వాహనం కావాలని అభ్యర్థించవచ్చు. వీరు 24 గంటలూ అందుబాటులో ఉంటారు. కంట్రోల్ రూమ్ వాహనం లేదా సమీపంలోని పీసీఆర్ వాహనం కానీ.. ఎస్‌హెచ్‌ఓ వాహనం కానీ వచ్చి సదరు మహిళను వారి ఇంటి వద్ద భద్రంగా డ్రాప్ చేస్తారని.. కాగా.. ఈ సర్వీసులు పూర్తిగా ఉచితమని పోలీసులు తెలిపినట్టు.. ఓ వార్త జోరుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏది ఏమైనా.. ఇది కూడా మంచి విషయమే కదా.

Related Tags