వెరైటీ నంబర్ ప్లేట్లకు పోలీసుల చెక్.. తేడా వస్తే జైలుకే..!

చైన్ స్నాచింగ్ కేసులను తగ్గించే నేపథ్యంలో.. ట్విట్టర్ వేదికగా నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ హైదరాబాద్ వాహనదారులకు హెచ్చరిక జారీ చేశారు. వాహనదారులు నంబరు ప్లేటును స్పష్టంగా కనిపించేలా ఉంచకపోతే వారిని

వెరైటీ నంబర్ ప్లేట్లకు పోలీసుల చెక్.. తేడా వస్తే జైలుకే..!
Follow us

| Edited By:

Updated on: Mar 12, 2020 | 3:57 PM

చైన్ స్నాచింగ్ కేసులను తగ్గించే నేపథ్యంలో.. ట్విట్టర్ వేదికగా నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ హైదరాబాద్ వాహనదారులకు హెచ్చరిక జారీ చేశారు. వాహనదారులు నంబరు ప్లేటును స్పష్టంగా కనిపించేలా ఉంచకపోతే వారిని గొలుసు దొంగతనాలు చేసే వ్యక్తిగా (చైన్ స్నాచర్) అనుమానిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్విటర్ ద్వారా ప్రకటించారు.

కాగా.. తమ వద్ద తప్పుడు నంబర్‌ ప్లేట్లతో తిరుగుతున్న దాదాపు 2 వేల వాహనాలకు సంబంధించిన రికార్డులు ఉన్నాయని అంజనీ కుమార్ ట్వీట్‌లో పేర్కొన్నారు. సరిగ్గా లేని నంబర్‌ ప్లేట్లతో తిరుగుతున్న 384 మంది వాహనదారులపై మంగళవారం కేసులు నమోదు చేసినట్లు సీపీ చెప్పారు. రోడ్లపై నంబర్‌ ప్లేట్లు సరిగ్గా లేకుండా కనపడితే వెంటనే ఫొటోను తీసి 9490616555 నెంబరుకు వాట్సాప్ చేయాలని నగర పౌరులను సీపీ ట్విట్టర్‌లో కోరారు.

అయితే.. తరచూ రోడ్డు భద్రతా నిబంధనలు అతిక్రమించేవారు.. తమ నెంబరు ప్లేటు కనిపించకుండా ఒంపడం లేదా అక్షరాలు స్పష్టంగా కనిపించకుండా గీకడం వంటివి చేస్తుంటారు. మరికొందరు నకిలీ నంబరు ప్లేట్లతో తిరుగుతుంటారు. దీనివల్ల ట్రాఫిక్ పోలీస్ ఫోటో తీసినా చలానాలు తమకు రావని చాలా మంది ఇలా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు తాజా హెచ్చరిక చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

[svt-event date=”12/03/2020,3:36PM” class=”svt-cd-green” ]

[/svt-event]