Breaking News
  • ఢిల్లీ: తెలంగాణలోని కల్వకుర్తి నుండి ఏపీ లోని కరివేన వరకు 122 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల శాఖ అనుమతి . నూతన జాతీయ రహదారి తో హైదరాబాద్ నుంచి తిరుపతి మధ్య తగ్గనున్న 80 కిలోమీటర్ల దూరం . కల్వకుర్తి, నాగర్ కర్నూల్ , కొల్లాపూర్, ఆత్మకూరు, నంద్యాల నియోజకవర్గాలను కలుపుతూ జాతీయ రహదారి నిర్మాణం . ప్రాజెక్టులో భాగంగా సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం. భారతమాల పథకం కింద జాతీయ రహదారికి అనుమతి ఇచ్చిన కేంద్ర రవాణా శాఖ . 800 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్న కేంద్ర ప్రభుత్వం . 86 కిలోమీటర్లు తెలంగాణలోనూ, 26 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణం. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు , నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇంచార్జి నెడునూరి దిలీపాచారి. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన గడ్కరీ.
  • మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రేపై నటి కంగనా విమర్శలు. నేను మీలా తండ్రి సంపాదించిన ఆస్తిని తీసుకోను. అలా తీసుకోగలిగితే హిమాచల్‌ప్రదేశ్‌లోనే ఉండేదాన్ని. తండ్రి సంపాదనపై బతకడం నాకు ఇష్టం లేదు. నేను ఆత్మగౌరవంతో బతుకుతా-ట్విట్టర్‌లో కంగనా రనౌత్‌.
  • అమరావతి: సీనియర్‌ ఐఏఎస్‌ ముద్దాడ రవిచంద్ర బదిలీ. సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా ఉన్న రవిచంద్ర బదిలీ. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశం. బుడితి రాజశేఖర్‌కు అదనపు బాధ్యతలు అప్పగింత.
  • గీతం భూముల విషయంలో కోర్టు ఆర్డర్‌ను టీడీపీ వక్రీకరిస్తోంది. గీతం వర్సిటీ ఆధీనంలోని శాశ్వత నిర్మాణాలు మాత్రమే.. తొలగించొద్దని కోర్టు సూచించింది-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌. గీతం వర్సిటీ ప్రాంగణంలో ఆక్రమిత భూమిని.. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే టీడీపీ రాజకీయం చేస్తోంది. గీతం నుంచి స్వాధీనం చేసుకున్న విలువైన భూములను.. ప్రజా అవసరాలకు ప్రభుత్వం వినియోగిస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములున్నాయంటూ.. విమర్శలు చేసే టీడీపీ నేతలు రుజువు చేయాలి-అమర్‌నాథ్‌.
  • అమెరికాలో జోరుగా సాగుతున్న ముందస్తు పోలింగ్‌. టెక్సాస్‌లో ఓటేసేందుకు బారులు తీరిన ఓటర్లు. ఈనెల 13న మొదలైన ముందస్తు ఓటింగ్‌ ప్రక్రియ. ఇప్పటివరకు ఓటేసిన 70లక్షల మంది ఓటర్లు. నవంబర్‌ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ . ఈ శతాబ్ధానికే పోలింగ్‌ శాతం రికార్డుగా మారుతుందన్న నిపుణులు . అమెరికాలో నవంబర్‌ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ . ఎన్నికల కోసం అధ్యక్ష అభ్యర్థులు భారీ స్థాయిలో ప్రచారం .
  • టీవీ9 ఎఫెక్ట్‌: తూ.గో: ఈతకోట-గన్నవరం రహదారిపై గుంతల పూడ్చివేత . టీవీ9 కథనాలకు స్పందించిన అధికారులు . యుద్ధప్రాతిపదికన గోతులను పూడ్చుతున్న ఆర్‌ అండ్‌ బీ అధికారులు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు .
  • దివంగత నాయిని నర్సింహారెడ్డి భార్య అహల్య అనారోగ్యంతో కన్నుమూత. నాయిని తో పాటు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన అహల్య.. నాయిని అంతక్రియలకు వైద్యుల పర్యవేక్షణలో హాజరయిన అహల్య.

ఆయనే నా రియల్ హీరో…: సీపీ అంజనీ కుమార్

భారీగా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరం.. జలనగరంగా మారిపోయింది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు, కాలనీలు వాగులను తలపిస్తున్నాయి. గతంలో లోతట్టు ప్రాంతాలను మాత్రమే వర్షం నీరు ముంచేసేది.. కానీ ఇప్పుడు సీన్ మారింది. అన్ని ప్రాంతాలు నీటిలో తేలుతున్నాయి...

cp anjani kumar, ఆయనే నా రియల్ హీరో…: సీపీ అంజనీ కుమార్

భారీగా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరం.. జలనగరంగా మారిపోయింది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు, కాలనీలు వాగులను తలపిస్తున్నాయి. గతంలో లోతట్టు ప్రాంతాలను మాత్రమే వర్షం నీరు ముంచేసేది.. కానీ ఇప్పుడు సీన్ మారింది. అన్ని ప్రాంతాలు నీటిలో తేలుతున్నాయి.

అయితే ఈ వరద నీటిలో అన్ని ప్రాంతాలు జలదిగ్భందంలోకి చిక్కుకున్నాయి. ఇలా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ఇంట్లోకి వరద నీరు చేరడంతో, నాలుగు రోజులుగా ఆయన ఆఫీసులోనే ఉంటూ డ్యూటీ నిర్వహిస్తున్నారు. మరో 300 మంది పోలీసు అధికారుల ఇళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు తమ కుటుంబాలు వరద నీటిలో చిక్కుకున్నప్పటికీ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు.

ఇక నగరంలోని ప్రస్తుత పరిస్థితి గురించి సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు.‌ వరద సహాయక చర్యల కోసం ముమ్మర ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మూసి లోతట్టు ప్రాంతంలో కొన్ని చోట్ల వరద నీరు ఉందని, కుల్సుంపుర, కార్వాన్, తప్పాచపుత్ర, అఫ్జల్‌గంజ్‌, మలక్‌పేట్‌, చాదర్‌ఘాట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం వరద ఉధృతి కాస్త ఎక్కువగానే ఉన్నట్లు పేర్కొన్నారు. ఫలక్‌నామా ఏరియాలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు. ముంపు ప్రాంతాల్లో పోలీసులు విస్త్రృత సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. అదే విధంగా రెస్క్యూ ఆపరేషన్‌ జరుగుతున్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అవసరమైతే తప్ప ప్రజలు ఎవరు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.

‘‘చిక్కడ్‌పల్లి పోలీస్‌ కానిస్టేబుల్‌ వీరేందర్‌ నా హీరో. వరద నీటిలో చిక్కుకుపోయిన 25 మందిని ఆయన కాపాడారు. అరవింద్‌ నగర్‌, దోమలగూడ వద్ద ఇది జరిగింది. ఇలాంటి ఆఫీసర్లే మా బృందంలో ఉన్న నిజమైన స్టార్లు. ఆయనకు సెల్యూట్‌ చేస్తున్నా. అలాగే హైదరాబాద్‌ పోలీసులకు ప్రోత్సాహం అందిస్తున్న ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు’’ అంటూ సీపీ అంజనీ కుమార్‌ కానిస్టేబుల్‌ వీరేందర్‌పై ప్రశంసలు కురిపించారు.

Related Tags