లోన్ పేరుతో.. రాజకీయ నాయకులకు టోపి పెట్టిన కేటుగాడు

Hyderabad Police Arrest Man For Duping Legislators On Pretext Of Giving Loans

రాజకీయ నాయకులను టార్గెట్ చేసి ఓ సైబర్ నేరస్తుడు పెద్ద మొత్తంలో దోచుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు మిగిలిని రాజకీయ నాయకులను మోసం చేశాడు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తోట బాలాజీ ఎన్టీపీసీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేశాడు. పథకాల పేరుతో సబ్సిడీ లోన్ ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి.. 50 లక్షల రూపాయల లోన్ ఇప్పటిస్తానని నమ్మబలికాడు. అందుకు 5 శాతం తనకు ఫీజ్ చెల్లించాలని చెప్పాడు. రెండున్నర లక్షల రూపాయలు తన అకౌంట్ లో వేయాలని సూచించాడు. ఇది నమ్మన సదరు ఎమ్మెల్యే తన కొడుకుచేత అనుకున్న మొత్తం అకౌంట్‌లో వేయించాడు. అయితే ఎన్ని రోజులు చూసిన లోన్ రాకపోవడంతో.. ఎమ్మెల్యే కొడుకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు.. బాలాజీని అదుపులోకి తీసుకున్నారు. ఇతడిపై తెలంగాణ, ఏపీలో 60కి పైగా కేసులు నమోదయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *