ధారావీ మోడ‌ల్ : క‌రోనాపై ఓల్డ్ సిటీ అద్బుత పోరాటం…

జీహెచ్ఎంసీలోని చాలా ప్రాంతాలు క‌రోనా వైర‌స్ వ్యాప్తితో అల్లాడిపోతున్నాయి. ఇంత‌లా వ్యాధి ప్ర‌బ‌‌లుతోన్న వేళ‌ కూడా ఓల్డ్ సిటీలోని కొన్ని వాడ‌లు మ‌హ‌మ్మారిపై స‌మ‌ర్థ‌వంతంగా ఫైట్ చేస్తున్నాయి.

ధారావీ మోడ‌ల్ :  క‌రోనాపై ఓల్డ్ సిటీ అద్బుత పోరాటం...
Follow us

|

Updated on: Jul 05, 2020 | 2:11 PM

జీహెచ్ఎంసీలోని చాలా ప్రాంతాలు క‌రోనా వైర‌స్ వ్యాప్తితో అల్లాడిపోతున్నాయి. ఇంత‌లా వ్యాధి ప్ర‌బ‌‌లుతోన్న వేళ‌ కూడా ఓల్డ్ సిటీలోని కొన్ని వాడ‌లు మ‌హ‌మ్మారిపై స‌మ‌ర్థ‌వంతంగా ఫైట్ చేస్తున్నాయి. ఇందుకు ప్రధాన కార‌ణం క‌రోనాపై అద్బుత పోరాటం చేస్తోన్న ముంబైలోని ధారావీ మోడ‌ల్ ను ఆద‌ర్శంగా తీసుకోవ‌డమే. ఆశావ‌ర్కర్ల‌తో పాటు క‌మ్యూనిటీ లీడ‌ర్లు చొర‌వ తీసుకుని ఓల్డ్ సిటీలో క‌రోనా వ్యాప్తి చాలా వ‌ర‌కు నివారించ‌గ‌లిగారు. ఆశా వ‌ర్క‌ర్లు భారీగా అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేయ‌డంతో పాటు ప్ర‌తి ఇంటికి వెళ్లి కోవిడ్-19 సోకకువ‌డా పాటించాల్సిన జాగ్ర‌త్త‌లు తెలియ‌జేశారు.

ఓల్డ్ సిటీలోని 10 స్ల‌మ్ ఏరియాల్లో మొత్తం ల‌క్షా యాభై వేల జ‌నాభా నివ‌శిస్తున్నారు. ఈ ప్రాంతాల‌లో గ‌డిచిన 30 రోజుల్లో కేవ‌లం 46 మందికి మాత్ర‌మే వైర‌స్ సోకింది. యుద్ద ప్రాతిప‌దికన చేసిన‌ పారిశుద్ద్య ప‌నులు క‌రోనాను పార‌ద్రోల‌టంలో బాగా ఉప‌యోగ‌ప‌డ్డాయి. భౌతిక దూరంపై అవ‌గాహ‌న క‌ల్పించ‌క‌పోయుంటే అక్క‌డ ప‌రిస్థితులు ఎలా ఉండేవే ఊహించ‌డ‌మే క‌ష్టం. ఆసియాలోని అతి పెద్ద స్ల‌మ్ ప్రాంతం ముంబైలోని ధారావీ ప్రాంతం క‌రోనాపై పోరాడిన తీరు నుంచి స్ఫూర్తి పొందిన క‌మ్యూనిటీ పెద్ద‌లు, ఆశా వ‌ర్క‌ర్లు వైర‌స్ వ్యాపించ‌కుండా తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేసి..స‌క్సెస్ అయ్యారు. ఓ.. ఎన్.జీ.ఓ చేసిన స‌ర్వేలో ఈ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. జ‌హంగిరాబాద్, గౌస్ న‌గ‌ర్, నూరీ న‌గ‌ర్, హ‌షీమాబాద్, ఇస్మాయిల్ న‌గ‌ర్, రాజీవ్ గాంధీ న‌గ‌ర్, హుస్సేన్ న‌గ‌ర్, ప‌టేల్ న‌గ‌ర్ ప్రాంతాల‌లో ఈ స‌ర్వే జ‌రిగింది.