మెట్రో ప్రయాణికులకు అందుబాటులోకి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు

నగరవాసులకు మెట్రో అధికారులు శుభవార్త ప్రకటించారు. ఫస్ట్ అండ్ లాస్ట్ కనెక్టివిటీలో భాగంగా మెట్రోస్టేషన్లలో అద్దెకార్లు అందుబాటులోకి తెచ్చారు. సెల్ఫ్ డ్రైవింగ్ పద్ధతిలో అద్దె ప్రాతిపాదికన నడిచే బ్యాటరీ ఆపరేటెడ్ కార్లను మియాపూర్ స్టేషన్ కేంద్రంగా వివిధ ప్రాంతాలకు నడుపుతున్నారు. అయితే అతి చౌకగా వీటిని అందుబాటులోకి తెచ్చారు. కేవలం గంటకు రూ.40 మాత్రమే చార్జి చేస్తున్నారు. మొట్టమొదటిగా 25 మహీంద్రా కార్లను అందుబాటులోకి తెచ్చిన మెట్రోరైలు అధికారులు దశల వారీగా ఇతర స్టేషన్లకు విస్తరించనున్నారు. అయితే […]

మెట్రో ప్రయాణికులకు అందుబాటులోకి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు
Follow us

|

Updated on: Jun 08, 2019 | 11:38 AM

నగరవాసులకు మెట్రో అధికారులు శుభవార్త ప్రకటించారు. ఫస్ట్ అండ్ లాస్ట్ కనెక్టివిటీలో భాగంగా మెట్రోస్టేషన్లలో అద్దెకార్లు అందుబాటులోకి తెచ్చారు. సెల్ఫ్ డ్రైవింగ్ పద్ధతిలో అద్దె ప్రాతిపాదికన నడిచే బ్యాటరీ ఆపరేటెడ్ కార్లను మియాపూర్ స్టేషన్ కేంద్రంగా వివిధ ప్రాంతాలకు నడుపుతున్నారు. అయితే అతి చౌకగా వీటిని అందుబాటులోకి తెచ్చారు. కేవలం గంటకు రూ.40 మాత్రమే చార్జి చేస్తున్నారు. మొట్టమొదటిగా 25 మహీంద్రా కార్లను అందుబాటులోకి తెచ్చిన మెట్రోరైలు అధికారులు దశల వారీగా ఇతర స్టేషన్లకు విస్తరించనున్నారు.

అయితే వీటిని మియాపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుతోపాటు మాదాపూర్ ప్రాంతాలకు నడుపుతున్నారు. మియాపూర్ మెట్రోస్టేషన్లో దిగిన ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరడానికి వీటిని ఉపయోగించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనికోసం జూమ్‌కార్‌తో మెట్రోసంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. పూర్తిస్థాయిలో పర్యావరణ హితమైన వాహనాన్ని వినియోగించుకోవాలంటే ప్రయాణికుడు ముందుగా జూమ్‌కార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్‌ను అప్‌లోడ్ చేయాలి. అనంతరం కార్‌లాక్ అన్‌లాక్ చేసుకొనే సౌలభ్యం ఉంటుంది.

యాప్‌లో ఎన్నిగంటలు వాడుకుంటారో ఆప్షన్ సెలక్ట్‌ చేసుకొని అందుకు తగినంత మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. పూర్తిస్థాయి జీపీఎస్ సిస్టం కలిగి ఉన్న ఈ కార్లు తాము గమ్యస్థానానికి చేరి పార్కింగ్ చేయగానే లాక్ చేయబడుతుంది. అక్కడి నుండి స్టేషన్‌కు రావాలనుకున్న వ్యక్తులు మళ్లీ దానిని ఉపయోగించుకొనే విధంగా అధికారులు వీలు కల్పించారు. ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించేవారితో పాటు ఐటీ ఉద్యోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పూర్తిస్థాయి అన్‌మ్యాన్‌డ్‌గా ఆపరేట్ చేసుకొనే వీలుండటంతో వ్యక్తిగత వాహనాల సంఖ్య తగ్గుతుందని మెట్రో అధికారులు భావిస్తున్నారు.

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..