Hyderabad Metro: కరోనావైరస్ నేపథ్యంలో.. హైదరాబాద్ మెట్రో ప్రత్యేక చర్యలు!

చైనాతో మొదలై ప్రపంచ దేశాలకు విస్తరించిన కరోనావైరస్ కల్లోలానికి ప్రపంచం వణికిపోతోంది. ఇప్పుడు ఇండియాలోను ఈ వైరస్ ప్రవేశించి భయపెడుతున్నది. హైదరాబాద్‌లో తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో

Hyderabad Metro: కరోనావైరస్ నేపథ్యంలో.. హైదరాబాద్ మెట్రో ప్రత్యేక చర్యలు!
Follow us

| Edited By:

Updated on: Mar 04, 2020 | 4:34 PM

Hyderabad Metro: చైనాతో మొదలై ప్రపంచ దేశాలకు విస్తరించిన కరోనావైరస్ కల్లోలానికి ప్రపంచం వణికిపోతోంది. ఇప్పుడు ఇండియాలోను ఈ వైరస్ ప్రవేశించి భయపెడుతున్నది. హైదరాబాద్‌లో తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో మెట్రో రైలు అధికారులు అప్రమత్తమయ్యారు. మెట్రో స్టేషన్లు, రైళ్లలో ప్రత్యేక పరిశుభ్రత చర్యలు తీసుకుంటున్నట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రజలు ఎక్కువగా తాకే ప్రదేశాల్లో ప్రత్యేక పరిశుభ్రతా చర్యలు చేపట్టినట్లు వివరించారు.

తెలంగాణాలో కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెట్రో అధికారులు చెబుతున్నారు. ప్రతిరోజు రాత్రి మెట్రోరైళ్లు డిపోకు చేరాక ప్రతి రైలును స్టెరిలైజ్‌ చేసి, అధికారి ధ్రువీకరించాకే ట్రాక్‌పైకి పంపిస్తున్నామని అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరిస్తున్నారు. మెట్రోస్టేషన్లు, రైళ్లు, చేతులు తగిలే ప్రాంతాలు, ఎస్కలేటర్లు, హ్యాండ్‌ రైల్స్‌ ఎప్పటికప్పుడు శుభ్రపర్చడం, మెట్రో డిపోకు చేరాక సబ్బు, డిటర్జెంట్లతో కడగడం చేస్తున్నామన్నారు.