హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. మొదటి మెట్రో రైల్ ఇన్ని గంటలకే.. ఆ మూడు స్టేషన్లు రీ-ఓపెన్..

నగరంలో పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ప్రయాణీకులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ అందించింది. రేపటి నుంచి మెట్రో రైలు ప్రయాణ సమయాన్ని..

  • Ravi Kiran
  • Publish Date - 6:23 pm, Wed, 2 December 20
Hyderabad Metro

Hyderabad Metro: హైదరాబాద్‌లో పెరుగుతున్న రద్దీ దృష్ట్యా నగరవాసులు ఎక్కువగా మెట్రో రైల్‌లో ప్రయాణించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రయాణీకుల సౌకర్యార్ధం మెట్రో రైల్ సమయాన్ని పొడిగించనున్నారు. రేపటి నుంచి ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు మెట్రో రైలు సర్వీసులు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు మెట్రో సేవలు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యేవని… రేపటి నుంచి ఉదయం 6.30 గంటలకే ఫస్ట్ మెట్రో ట్రైన్ స్టార్ట్ అవుతుందన్నారు. అయితే గతంలో మాదిరిగా చివరి మెట్రో రైల్ సమయంలో ఎలాంటి మార్పులేదని వెల్లడించారు. అలాగే కరోనా నేపథ్యంలో ఇప్పటిదాకా మూసేసిన భరత్ నగర్, గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్ మెట్రో స్టేషన్లు రేపట్నుంచి తెరుచుకోనున్నాయని తెలిపారు.

Also Read: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. తగ్గించిన వేతనాలు చెల్లింపుకు కీలక ఉత్తర్వులు…