గణపయ్యల ఊరేగింపు.. భక్తులకు మెట్రో గుడ్ న్యూస్

Hyderabad metro extends train timings in view of Ganesh idol immersion, గణపయ్యల ఊరేగింపు.. భక్తులకు మెట్రో గుడ్ న్యూస్

భాగ్యనగర్‌లో గుణపయ్యల ఊరేగింపు సందర్భంగా హైదరాబాద్ మెట్రో నిమజ్జన వీక్షకుల కోసం ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. ట్యాంక్‌బండ్ వద్ద వినాయక నిమజ్జనం చూసేందుకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ నాలుగున్నర నిమిషాలకు ఓ రైలును నడుపుతున్నట్టు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. నిమజ్జన వేడుకల సందర్భంగా రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు మెట్రో సర్వీసులను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. హుస్సేన్ సాగర్‌లో జరుగుతున్న వినాయక నిమజ్జనాన్ని తిలకించేందుకు నగరంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే భక్తుల రద్దీని తట్టుకునేలా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. సాధారణ రోజుల్లో మెట్రో చివరి సర్వీస్ రాత్రి 10.30గంటలకు ఉంటుందని.. కానీ గురువారం రాత్రి 12గంటల వరకు సర్వీసులు కొనసాగిస్తామని వెల్లడించారు. అవసరమైతే.. అర్థరాత్రి కూడా మెట్రో సర్వీసులు నడుపుతామని తెలిపారు. ట్యాంక్‌బండ్‌ పైకి చేరుకునేందుకు ఖైరతాబాద్ వరకు మెట్రోలో సులభంగా వెళ్లే అవకాశం ఉండటంతో ఎక్కువమంది మెట్రోను ఆశ్రయించే అవకాశం ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *