దేశ రెండో రాజధానిగా హైదరాబాద్.. ప్రారంభమైన కసరత్తులు..?

హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుందేమోనని అభిప్రాయపడ్డారు మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అతి ప్రమాదకర స్థాయికి చేరుకుందని పేర్కొన్న ఆయన.. అక్కడి ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే డా. అంబేద్కర్ కోరుకున్నట్లుగా బహుశా రెండో రాజధాని హైదరాబాద్ అవ్వొచ్చని తెలిపారు. ఓ కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మళ్లీ దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి ఘనంగా చాటుకోవడానికి ప్రయత్నం జరగాలని ఈ […]

దేశ రెండో రాజధానిగా హైదరాబాద్.. ప్రారంభమైన కసరత్తులు..?
Follow us

| Edited By:

Updated on: Nov 05, 2019 | 3:50 PM

హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుందేమోనని అభిప్రాయపడ్డారు మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అతి ప్రమాదకర స్థాయికి చేరుకుందని పేర్కొన్న ఆయన.. అక్కడి ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే డా. అంబేద్కర్ కోరుకున్నట్లుగా బహుశా రెండో రాజధాని హైదరాబాద్ అవ్వొచ్చని తెలిపారు. ఓ కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మళ్లీ దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి ఘనంగా చాటుకోవడానికి ప్రయత్నం జరగాలని ఈ సందర్భంగా విద్యా సాగర్ రావు అభిలషించారు.

కాగా ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఏడాదికేడాదికి అక్కడ కాలుష్యం పెరుగుతోంది. దీనిని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. పెద్దగా ఫలితం కనిపించడం లేదు. ఇక రాజధాని కాబట్టి దేశ పరిపాలన వ్యవస్థతో పాటు సుప్రీంకోర్టు, ఇతర ప్రభుత్వ ఆఫీసులన్నీ అక్కడే ఉండగా.. రాజకీయ నాయకులతో పాటు ఇతర ప్రాంతాల వాసుల రాకపోకలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే కాలుష్యం కారణంగా అక్కడి పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. మరోవైపు వేసవి కాలంలోనూ అక్కడ విపరీతమైన ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఇలా అన్నింటికి కష్టం అవుతుండటంతో.. రెండో రాజధాని అవసరమన్న అభిప్రాయాలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. కొందరైతే ఏకంగా రాజధానినే ఢిల్లీ నుంచి మార్చమని కోరుతున్నారు.

లిస్ట్‌లో ఉన్న నగరాలు ఏవంటే: ఇక రెండో రాజధాని లిస్ట్‌లో ముంబయి, భోపాల్, నాగ్‌పూర్, రాయ్‌పూర్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, వైజాగ్, అమరావతి నగరాల పేర్లు వినిపిస్తున్నాయి. వీటన్నింటిలో ప్రతి నగరానికి ఏదో సమస్య ఉండగా.. రెండో రాజధానిగా మార్చేందుకు హైదరాబాద్‌కు తక్కువ సమస్యలు ఉన్నాయి. ఇక ఇదే విషయాన్ని అంబేద్కర్ బతికున్నప్పడు సైతం తెలిపారు. దేశ రాజధాని కావడానికి హైదరాబాద్‌కు అన్ని అర్హతలు ఉన్నాయంటూ ఆయన అప్పట్లో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈ క్రమంలోనే మళ్లీ రెండో రాజధాని ప్రస్తావన వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా మార్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు అప్పుడెప్పుడో కథనాలు వచ్చాయి. దానికి సంబంధించిన కసరత్తు కూడా ప్రారంభమైనట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. వీటిని దృష్టిలో పెట్టుకొనే విద్యాసాగర్ రావు తాజాగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే