Breaking News
  • కీసర ఎమ్మార్వో కేసులో బయటపడుతున్న అక్రమాస్తులు. ఎమ్మార్వో ఆస్తులు 100 కోట్ల పైచిలుకు ఉంటుందని ఎసిబి అంచనా. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు అమ్మకాలు జరిపిన నాగరాజు. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో పెద్దగా ఆస్తులు కొనుగోలు. ఎమ్మార్వో ని పట్టుకున్న సంఘంలో కోటి ఇరవై ఎనిమిది లక్షలు స్వాధీనం. ఇంటిలో సోదా చేయగా 28 లక్షల రూపాయల నగదు లభ్యం.
  • కరోనా భారిన పడి చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకులు శ్రీ SP బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను...సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్ని వర్గాల ప్రజలను ఈ కరోనా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది. కరోనా మహమ్మారి త్వరగా పోయి ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి. ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా భారిన పడకుండా రక్షించుకోవచ్చు
  • టుగెద‌ర్ యాజ్ ఒన్ పాట‌ను ట్వీట్ చేసిన చ‌ర‌ణ్‌. మంచి కాజ్ కోసం ఈ పాట అంటూ ట్వీట్ చేసిన రామ్‌చ‌ర‌ణ్‌. 65 మంది క‌లిసి పాడిన పాట అని ట్వీట్ చేసిన చ‌ర‌ణ్‌. 65 మంది గాయ‌కులు, ఐదు భాష‌ల్లో పాడిన పాట.
  • ఏఎస్సై రామకృష్ణ ఆత్మహత్య ప్రయత్నం. అధికారుల వేధింపులు తాళలేక సూసైడ్ అటెంప్ట్. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య ప్రయత్నం. స్థానిక జోడిమెట్ల లోని క్యూర్ వెల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏ ఎస్ ఐ రామకృష్ణ.
  • స్వర్ణ పేలస్ ఫైర్ యాక్సిడెంట్ అగ్నిప్రమాదం పై ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చెసిన హీరో రామ్. రమేశ్ హాస్పిటల్ ఎండీ రమేశ్ కు అన్న కొడుకు హీరో రామ్. పెద్ద కుట్ర జరుగుతోంది.. సీఎం జగన్ ని తప్పుగా చూపించడానికి మీ కింద పనిచేసే కొంతమంది మీకు తెలీకుండా చేసే పనులు వాళ్ళమీ రివ్యూటేషన కి మీ మీద పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ జరుగుతోంది. స్వర్ణ పేలస్ ని రమేష్ ఆసుపత్రి కోవిడ్ హాస్పిటల్ గా తీసుకోకముందే దాన్ని ప్రభుత్వం కోవిడ్ సెంటర్ గా వినియోగించింది. అప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఉంటే ఎవర్నీ నిందించేవాళ్ళు..హీరో రామ్.
  • రాఘ‌వేంద్ర‌రావు : కేసీఆర్‌గారి స్ఫూర్తితో ఎంపీ సంతోష్‌కుమార్‌గారు త‌ల‌పెట్టిన ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం కావాలి. మ‌ట్టి వినాయ‌కుడిని పూజిద్దాం. ప్ర‌కృతిని కాపాడుకుందాం. వినాయ‌కుడు అంటే మ‌న విఘ్నాల‌ను తొల‌గించేవాడు. అందుకే ద‌య‌చేసి పూజ పూర్త‌యిన త‌ర్వాత ఎవ‌రూ వినాయ‌కుడిని నిమ‌జ్జ‌నం చేయొద్దు. ఒక తొట్టిలో వేసి నీరుపోయండి. ఆ మట్టిలో మొక్క పెరుగుతుంది.

బ్రేకింగ్ : రేపటి నుంచి తెరుచుకోనున్న హైదరాబాద్ మార్కెట్లు

హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా దెబ్బకు స్వచ్ఛందంగా మూతపడ్డ మర్కెట్లు రేపటి నుంచి మళ్లీ షురూ కానున్నాయి. గత పదిరోజుల నుంచి ఈనెల 5 వరకు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ ప్రకటించుకున్న బేగంబజార్‌, జనరల్ బజార్ మార్కెట్లు ఈ నెల 6 నుంచి సోమవారం నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి.
Hyderabad markets reopen from July 6, బ్రేకింగ్ : రేపటి నుంచి తెరుచుకోనున్న హైదరాబాద్ మార్కెట్లు

హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా దెబ్బకు స్వచ్ఛందంగా మూతపడ్డ మర్కెట్లు రేపటి నుంచి మళ్లీ షురూ కానున్నాయి. గత పదిరోజుల నుంచి ఈనెల 5 వరకు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ ప్రకటించుకున్న బేగంబజార్‌, జనరల్ బజార్ మార్కెట్లు ఈ నెల 6 నుంచి సోమవారం నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ విషయాన్ని ది హైదరాబాద్‌ కిరాణా దుకాణాల సంఘం కార్యవర్గం వెల్లడించింది. పది రోజుల తర్వాత ఈ నెల 6 నుంచి మార్కెట్‌లోని అన్ని దుకాణాలను తెరవనున్నట్లు షాపు యాజమానులు తెలిపారు. అయితే, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తామని తెలిపారు. సోమవారం నుంచి దుకాణాలు తెరిచినా కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తామని షాపు యాజమానులు వెల్లడించారు. వినియోగదారులు భౌతిక దూరం పాటించి, మాస్క్‌లు ధరించి రావాలని సూచిస్తున్నారు. ఇక ప్రతిరోజు మార్కెట్‌ పరిసరాలను శానిటైజ్‌ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Related Tags