“నా సోదరుడ్ని కువైట్‌లో వేధిస్తున్నారు, దయచేసి కాపాడండి”

కువైట్‌లో జాబ్ చేస్తూ మోసపూరిత కారణాల వల్ల గల్ఫ్‌లో చిక్కుకుపోయిన తన సోదరుడిని భారతదేశానికి సురక్షితంగా తిరిగి వచ్చేలా చూడాలని హైదారాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

  • Ram Naramaneni
  • Publish Date - 4:30 pm, Thu, 22 October 20

కువైట్‌లో జాబ్ చేస్తూ మోసపూరిత కారణాల వల్ల గల్ఫ్‌లో చిక్కుకుపోయిన తన సోదరుడిని భారతదేశానికి సురక్షితంగా తిరిగి వచ్చేలా చూడాలని హైదారాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గత 23 సంవత్సరాల నుండి కువైట్‌లో పనిచేసిన తరువాత తన సోదరుడు మీర్జా ముజీబుద్దీన్ ఇప్పుడు నిరుద్యోగి అయ్యాడని మీర్జా ముఖీముద్దీన్ బుధవారం తెలిపారు. మీర్జా ముజీబుద్దీన్ కఫీల్ (స్పాన్సర్) అతనిపై తప్పుడు కేసు నమోదు చేశారని ఆరోపించారు. 

“నా సోదరుడి పేరు మీర్జా ముజీబుద్దీన్. అతడు భారతీయ పౌరుడు. గత 23 సంవత్సరాలుగా కువైట్‌లో పనిచేస్తున్నాడు. ప్రస్తుత యజమాని వద్ద గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. 2020 జనవరిలో కువైట్ వదిలి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. ఇకపై భారతదేశంలోనే స్థిరపడాలనుకున్నాడు. ఈ విషయాన్ని తన యజమాని చెప్పి తనకు రావాల్సిన డబ్బుతో పాటు పాస్‌పోర్ట్ ఇవ్వమని కోరాడు. అప్పట్నుంచి సదరు యజమాని నా సోదరుడిపై కక్ష పెట్టుకుని వేధిస్తున్నారు” అని మీర్జా ముఖీముద్దీన్ పేర్కొన్నారు.

జనవరి 30, 2020 న, మీర్జా ముజీబుద్దీన్  కాఫీల్ (స్పాన్సర్) ఫ్రాడ్, ఛీటింగ్ అభియోగాలతో తన సోదరుడిపై పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్‌లో కేసు వేశారని ముఖీముద్దీన్ చెప్పారు. కాని కరోనావైరస్ సమస్య, లాక్డౌన్ కారణంగా కేసు పెండింగ్‌లో ఉందని చెప్పారు. బలమైన ఆధారాలు లేకపోవడంతో ఆ తర్వాత కాలంలో కేసు కొట్టేశారని తెలిపారు.

“దీంతో సదరు  యజమాని పాస్‌పోర్ట్ అప్పగించారు, కానీ 15 రోజుల్లో కువైట్ విడిచివెళ్లాలని నిబంధన పెట్టారు. నా సోదరుడు ఈ షరతును అంగీకరించి, పాస్‌పోర్టులు తీసుకొని సెప్టెంబర్ 13 న ప్రయాణించడానికి టిక్కెట్లను బుక్ చేసుకున్నాడు. అతను ఎయిర్ ఇండియా నుంచి 5 టిక్కెట్లు కొనడానికి చాలా డబ్బు ఖర్చు చేశాడు. సెప్టెంబర్ 13 న విమానాశ్రయానికి చేరుకుని సామాను తనిఖీ అనంతరం ఇమ్మిగ్రేషన్ వైపు వెళ్ళాడు. అక్కడ తన పాస్‌పోర్ట్‌పై ప్రయాణ నిషేధం ఉందని పేర్కొంటూ ఇమ్మిగ్రేషన్ అథారిటీ అతన్ని ఆపివేసింది “అని సోదరుడు తెలిపారు.

యజమాని తన సోదరుడిని డబ్బు కోసం డిమాండ్ చేస్తున్నారని, చంపుతామంటూ బెదిరిస్తున్నారని మీర్జా ముఖీముద్దీన్ తెలిపారు. తన సోదరుడి కుటుంబాన్ని క్షేమంగా స్వదేశానికి తిరిగి వచ్చేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.  ( “వాడి పొగరు ఎగిరే జెండా”, అంచనాలకు మించిన తారక్ టీజర్ )