ఫేస్‌బుక్‌ పరిచయం… రూ.12 లక్షలకు కుచ్చుటోపీ!

Hyderabad Man robbed by Woman he met on Facebook, ఫేస్‌బుక్‌ పరిచయం… రూ.12 లక్షలకు కుచ్చుటోపీ!

రామంతాపూర్‌ ఇందిరానగర్‌ వాసికి గత ఏడాది ఆగస్టులో ఓ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. తన పేరు సాండ్రా ఐడా ఆడర్సన్‌ అని అటు నుంచి చెప్పింది. టెక్సాస్‌లో ఉంటానని చెప్పి చాటింగ్‌ ఆరంభించింది. కొన్ని రోజుల తర్వాత వాట్సాప్‌లో సంభాషణలు సాగించింది. ఓ రోజు అతడి చిరునామా అడిగి.. స్నేహానికి గుర్తుగా భారీఎత్తున విదేశీ కరెన్సీ, బహుమతులతో కూడిన పార్సిల్‌ను పంపిస్తానని చెప్పింది. తాను పంపే కొరియర్‌ త్వరలోనే చేరుతుందని ఆశపెట్టింది. ఆ తర్వాత నాటకం మొదలైంది. విమానాశ్రయం నుంచి కస్టమ్స్‌ అధికారుల పేరిట ఫిలిప్‌, అనిత శర్మ ఫోన్‌లో బాధితుడితో మాట్లాడారు. విదేశీ కరెన్సీతో కూడిన పార్సిల్‌ను మీ చిరునామాకు పంపించాలంటే డెలివరీ ఛార్జీలను తాము సూచించిన బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలని సూచించారు. అలామొదలైన వసూళ్ల పరంపర కస్టమ్స్‌ సుంకం, జీఎస్టీ, విదేశీ మారకపు పన్ను.. ఇలా రకరకాల పేర్లు చెప్పి ఏకంగా రూ.12.01 లక్షలు వసూలు చేశారు. తర్వాత ఫోన్లు మూగపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *