ఎత్తుపళ్ల కారణంగా తలాక్‌ చెప్పిన భర్త..!

ట్రిపుల్‌ తలాక్‌ అందరికీ సుపరిచితమైన పదం.. ముస్లీం భర్తలు అత్యంత సులువుగా తమ భార్యాలకు విడాకులు ఇచ్చేందుకు మూడు సార్లు తలాక్‌ అంటే సరిపోతుంది. అయితే, దీంతో ముస్లీం మహిళలకు అన్యాయం జరుగుతోందని తేల్చిన కేంద్రం ..ట్రిపుల్‌ తలాక్‌ నుంచి విముక్తి కల్పించాలని చట్టం చేసింది. అయినప్పటికీ ఇంకా చాలా మందిలో మార్పు రావడంలేదు. ఏదో ఓ చోట తలాక్ బాధితులు వెలుగులోకి వస్తూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లో తలాక్‌ వ్యవహారం కలకలం సృష్టించింది. పెళ్లైన మూడు […]

ఎత్తుపళ్ల కారణంగా తలాక్‌ చెప్పిన భర్త..!
Follow us

|

Updated on: Nov 13, 2019 | 7:00 PM

ట్రిపుల్‌ తలాక్‌ అందరికీ సుపరిచితమైన పదం.. ముస్లీం భర్తలు అత్యంత సులువుగా తమ భార్యాలకు విడాకులు ఇచ్చేందుకు మూడు సార్లు తలాక్‌ అంటే సరిపోతుంది. అయితే, దీంతో ముస్లీం మహిళలకు అన్యాయం జరుగుతోందని తేల్చిన కేంద్రం ..ట్రిపుల్‌ తలాక్‌ నుంచి విముక్తి కల్పించాలని చట్టం చేసింది. అయినప్పటికీ ఇంకా చాలా మందిలో మార్పు రావడంలేదు. ఏదో ఓ చోట తలాక్ బాధితులు వెలుగులోకి వస్తూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లో తలాక్‌ వ్యవహారం కలకలం సృష్టించింది. పెళ్లైన మూడు నెలలకే భార్యకు ఓ వ్యక్తి తలాక్‌ చెప్పాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నగరంలోని కుషాయిగూడలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ముస్తాఫాకు మూడు నెలల క్రితం రుక్సానా అనే యువతితో వివాహం జరిగింది. అయితే, కొంతకాలం సాఫిగానే సాగిన వీరి సంసారంలో ఒక్కసారిగా కల్లోలం మొదలైంది. ఉన్నట్టుండి ముస్తాఫాలో మార్పు వచ్చింది. భార్యతో కలిసి ఉండలేనంటూ..ఆమెకు తలాక్‌ చెప్పాడు. ఖంగుతిన్న రుక్సానా.. భర్తను నిలదీసింది. తనకు తలాక్‌ చెప్పటానికి గల కారణం ఏంటని నిలదీసింది. భర్త చెప్పిన కారణం విని ఆమెకు దిమ్మతిరిగింది.

రుక్సానాకు పళ్లు ఎత్తుగా ఉన్నాయని, అందుకే తనకు తలాక్‌ చెప్పినట్లు రుక్సానా పోలీసులకు తెలిపింది. అంతేకాదు, తన భర్త, అత్తింటివాళ్లు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఆరోపించింది. తలాక్‌, అదనపు కట్నం వ్యవహారంపై కుషాయిగూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. రుక్సా ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు ముస్తాఫాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే, రుక్సా ఉద్దాంతం తెలిసిన ఓ డెంటల్‌ హాస్పిటల్‌ ఆమె ఎత్తుపళ్లను సరిచేసేందుకు ముందుకు వచ్చింది. ఆమె కూడా అందరిలా సంతోషంగా ఆరోగ్యకరమైన జీవితం గడపాలనే తాము ఆమెకు వైద్యం చేసేందుకు ముందుకు వచ్చినట్లుగా సదరు ఆస్పత్రి వైద్యులు తెలిపారు.