Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

లెగ్ బ్రేక్.. జీహెచ్‌ఎంసీదే ఆ మిస్టేక్..!

Hyderabad Man Files FIR Against GHMC, లెగ్ బ్రేక్.. జీహెచ్‌ఎంసీదే ఆ మిస్టేక్..!

రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని.. కొత్త ట్రాఫిక్ రూల్స్ తీసుకువచ్చి సామాన్యుల పై భారం మోపింది కేంద్ర ప్రభుత్వం. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై ఫైన్లు విధిస్తూ.. అధికారులు వారి జేబులను ఖాళీ చేసేస్తున్నారు. మరి రోడ్లు సరిగా లేకపోయినా ప్రమాదాలు జరుగుతాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వమా..? జీహెచ్ఎంసీ అధికారులా..? అని ఓ వ్యక్తి ప్రశ్నిస్తున్నాడు. జీహెచ్ఎంసీ తన కాలు విరగొట్టిందని అతడు డబిలీపురా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తాను బైక్ పై వెళుతుండగా.. ఓ గుంతలో పడి చేయి విరగొట్టుకున్నానని.. అందుకు జీహెచ్ఎంసీ కారణమంటూ అజ్మత్ హుస్సేన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అక్టోబర్ 6న రాత్రి సమయంలో.. తన బైక్ పై నూర్‌ఖాన్ బజార్ నుంచి బాల్‌షెట్టి ఖేట్‌కు వెళుతుండగా రోడ్డు పై ఉన్న గుంతలో బైక్ పడింది. దీంతో అతడు దూరంగా ఎగిరిపడ్డాడు. చెయ్యి విరగడంతో పాటు.. కాలుకి ఫ్రాక్చర్ అయింది. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే తన కాలు, చేయి విరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన గాయానికి జీహెచ్ఎంసీ అధికారులే బాధ్యత వహించాలన్నాడు. రోడ్డుపై గుంతలు పూచ్చకుండా.. సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని బాధితుడు ఆరోపించాడు. అజ్మత్ హుస్సేన్ ఫిర్యాదుతో ఐపీసీ 388 కింద డబిల్‌పురా పోలీసులు కేసు నమోదు చేశారు.

Related Tags