Sankranti: టీఆర్ఎస్ జెండా ప్రతిబింబించేలా 11 అడుగుల గాలిపటం.. సరికొత్తగా రూపొందించిన హైదరాబాదీ..

Sankranti: తెలంగాణలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. సంక్రాంతి అంటేనే కోడిపందేలు, ఎడ్ల పందేలు, రంగు రంగుల రంగవళ్లులు, గాలి పటాల విన్యాసాలు..

Sankranti: టీఆర్ఎస్ జెండా ప్రతిబింబించేలా 11 అడుగుల గాలిపటం.. సరికొత్తగా రూపొందించిన హైదరాబాదీ..
Follow us

|

Updated on: Jan 13, 2021 | 7:05 PM

Sankranti: తెలంగాణలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. సంక్రాంతి అంటేనే కోడిపందేలు, ఎడ్ల పందేలు, రంగు రంగుల రంగవళ్లులు, గాలి పటాల విన్యాసాలు, పసందైన వంటకాలు. హైదరాబాద్‌లో ముఖ్యంగా పతంగుల పోటీలు హైలెట్ అని చెప్పాలి. చిన్నా పెద్దా అంతా గాలి పటాలను ఎగురవేస్తారు. ఇక నెక్లెస్ రోడ్డులో అయితే కైట్ ఫెస్టివల్ పేరిట పోటీలు నిర్వహిస్తారు. ఇవి చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

ఇదంతా ఇలా ఉంటే.. పతంగుల విషయంలో హైదరాబాద్‌కు చెందిన గౌరీష్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించాలి ఇక్కడ. కూరగాయల దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్న గౌరీష్.. ప్రతీ ఏటా సంక్రాంతి పండుగకి తన ప్రత్యేకతను చాటుకుంటాడు. తనదైన శైలిలో ఏదో ఒకటి తయారు చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటాడు. ఈ ఏడాది సంక్రాంతి పర్వదినం సందర్భంగా కూడా గౌరీష్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. టీఆర్ఎస్ జెండాను ప్రతిబింబించేలా 11 అడుగుల గాలి పటాన్ని రూపొందించాడు. ఆ గాలిపటాన్ని కేవలం రూ.120తో తయారు చేయడం విశేషం. ఈ గాలిపటం ఇప్పుడు హైలెట్‌గా నిలిచింది. ఇక్కడ విశేషమేంటంటే.. గౌరీష్‌కు కనీస అక్షర జ్ఞానం లేకపోయినా.. తానేంటో, తన ప్రత్యేకత ఏంటో ప్రతిసారి నిరూపించుకుంటూ అందరితోనూ శభాష్ అనిపించుకుంటున్నాడు గౌరీష్.

Also read:

అమరావతిలో వేల ఎకరాలు బంధువులతో కొనిపించిన ఘనుడు చంద్రబాబు, గతంలో మాన్సస్ రద్దు చేయమన్న వ్యక్తి అశోక్: బొత్స

Corona Cases AP: ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 203 పాజిటివ్ కేసులు నమోదు..