హైదరాబాద్ జగద్గిరి గుట్టలో భారీ పేలుడు

హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని అస్బెస్టాస్ కాలనీ ఆటోలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆటోలో ఎక్కుతున్న యూసూఫ్ అలీ అనే వ్యక్తి కాలికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. యూసూఫ్ అలీ అనే వ్యక్తి ఇంటి బయట ఉన్న గోడ వద్ద ఈ పేలుడు జరిగింది. యూసూఫ్ అలీ తన ఆటో తీసుకోవడానికి బయటికి వచ్చాడు. తన కాళ్ళ కింద భారీ శబ్దంతో […]

  • Venkata Narayana
  • Publish Date - 3:03 pm, Sat, 24 October 20

హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని అస్బెస్టాస్ కాలనీ ఆటోలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆటోలో ఎక్కుతున్న యూసూఫ్ అలీ అనే వ్యక్తి కాలికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. యూసూఫ్ అలీ అనే వ్యక్తి ఇంటి బయట ఉన్న గోడ వద్ద ఈ పేలుడు జరిగింది. యూసూఫ్ అలీ తన ఆటో తీసుకోవడానికి బయటికి వచ్చాడు. తన కాళ్ళ కింద భారీ శబ్దంతో పేలుడు జరిగిందని అంటున్నారు కుటుంబ సభ్యులు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్నారు. ఘటన స్థలం దగ్గర నుంచి కొన్ని శాంపిల్స్ ను సేకరించారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులు చెబుతున్నారు.