వరల్డ్‌లో మోస్ట్ డైనమిక్ సిటీ‌గా హైదరాబాద్!

ప్రపంచంలోనే మోస్ట్ డైనమిక్ సిటీగా హైదరాబాద్ నిలిచింది. అంతేకాదు.. ప్రపంచంలో 20 మోస్ట్ డైనమిక్ నగరాల జాబితాలో.. 7 నగరాలు భారత్‌లోనే ఉండటం విశేషం. కాగా.. క్రీయాశీల నగరాల్లో ప్రపంచంలోనే తొలిస్థానంలో హైదరాబాద్‌ నిలిచింది. బెంగుళూరుని దాటి మొదటిస్థానానికి భాగ్యనగరం చేరింది. 2020గానూ మోస్ట్ డైనమిక్ సిటీగా హైదరాబాద్ నిలిచినట్లు స్థిరాస్తి అధ్యయన సంస్థ జేఎల‌్‌ఎల్ రూపొందించిన సిటీ మూమెంటమ్ ఇండెక్స్ 2020ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఓ హోటల్‌లో ఆవిష్కరించారు. ప్రపంచంలో 20 […]

వరల్డ్‌లో మోస్ట్ డైనమిక్ సిటీ‌గా హైదరాబాద్!
Follow us

| Edited By:

Updated on: Jan 19, 2020 | 10:36 AM

ప్రపంచంలోనే మోస్ట్ డైనమిక్ సిటీగా హైదరాబాద్ నిలిచింది. అంతేకాదు.. ప్రపంచంలో 20 మోస్ట్ డైనమిక్ నగరాల జాబితాలో.. 7 నగరాలు భారత్‌లోనే ఉండటం విశేషం.

కాగా.. క్రీయాశీల నగరాల్లో ప్రపంచంలోనే తొలిస్థానంలో హైదరాబాద్‌ నిలిచింది. బెంగుళూరుని దాటి మొదటిస్థానానికి భాగ్యనగరం చేరింది. 2020గానూ మోస్ట్ డైనమిక్ సిటీగా హైదరాబాద్ నిలిచినట్లు స్థిరాస్తి అధ్యయన సంస్థ జేఎల‌్‌ఎల్ రూపొందించిన సిటీ మూమెంటమ్ ఇండెక్స్ 2020ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఓ హోటల్‌లో ఆవిష్కరించారు.

ప్రపంచంలో 20 మోస్ట్ డైనమిక్ నగరాల జాబితాలో ఇండియాలోనే 7 నగరాలున్నాయన్నారు. ప్రపచంలో 130 నగరాలపై స్థిరాస్తి అధ్యయన సంస్థ సర్వే చేసింది. భారత్ నుంచి ఐదో ప్లేస్‌లో చెన్నై, ఏడో స్థానంలో ఢిల్లీ, పూణెకు 12వ స్థానం, 16వ స్థానంలో కోల్ కతా, 20వ స్థానంలో ముంబై నిలిచాయి. కాగా.. 2015లో 28, 2017లో 3వ స్థానం సంపాదించిన హైదరాబాద్ నగరం.. 2018లో కూడా టాప్‌ ప్లేస్‌లో నిలిచిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.