ఫుల్ జోష్‌లో ఉన్న హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్… పూర్తి వ్యూహంతో ఆడేందుకు రెడీ అవుతున్న హెచ్ఎఫ్‌సీ

ఐఎస్ఎల్ తొలి సీజన్‌ లో అనుకున్నంత స్థాయిలో ప్రదర్శన కనబరచని హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఈ సారి మెరుగైన ప్రదర్శన ఇవ్వాలనే పట్టుదలతో ఉంది. ఇందు కోసం కొత్త కోచ్ ను కూడా..

  • Sanjay Kasula
  • Publish Date - 11:56 pm, Sat, 21 November 20

Hyderabad FC : ఐఎస్ఎల్ తొలి సీజన్‌ లో అనుకున్నంత స్థాయిలో ప్రదర్శన కనబరచని హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఈ సారి మెరుగైన ప్రదర్శన ఇవ్వాలనే పట్టుదలతో ఉంది. ఇందు కోసం కొత్త కోచ్ ను కూడా నియమించుకుంది.

స్పెయిన్‌కు చెందిన మాన్యుయెల్‌ మార్కజ్‌ను హెడ్‌ కోచ్‌గా నియమించింది. గత సీజన్‌లో హైదరాబాద్‌ ఎఫ్‌సీ జట్టు సభ్యులు మంచి ఆటతీరును ప్రదర్శించలేక పోయింది. కేవలం రెండే రెండు విజయాలను నమోదు చేసింది.ఇక పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచి నిరాశ పరిచింది. దీంతో ఈసారి మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని చూస్తోంది.

రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిన జరిగే ఐఎస్ఎల్ టోర్నీలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. అనంతరం సెమీ ఫైనల్స్‌ జరుగుతాయి. కరోనా ఉండటంతో ఈసారి ఇంటా, బయట పద్ధతిలో కాకుండా ఒకే చోట సెమీస్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

ఇప్పటి వరకు లీగ్‌ తొలి అంచె మ్యాచ్‌ తేదీలను మాత్రమే ఐఎస్ఎల్ నిర్వాహకులు ప్రకటించారు. డిసెంబర్‌లో రెండో  స్టేజ్పో టీలతో పాటు సెమీస్, ఫైనల్‌ తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. సోమవారం ఒడిశాతో హైదరాబాద్ తన తొలి మ్యాచులో తేల్చుకోనుంది.