గండం గడిచింది.. ఊపిరి పీల్చుకో హైదరాబాద్!

తెలంగాణ రాష్ట్రాలనికి మరీ ముఖ్యంగా హైదరాబాద్ మహానగరానికి గండం తప్పిపోయింది. వర్షగండంతో అతలాకుతలమైన నగరానికి మరిన్ని వర్షాల ముప్పుందన్న ప్రచారం ఉత్తదేనని తేలిపోయింది. తేలికపాటి వర్షాలు తప్ప పెద్దగా ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు ప్రకటించారు.

గండం గడిచింది.. ఊపిరి పీల్చుకో హైదరాబాద్!
Follow us

|

Updated on: Oct 14, 2020 | 6:19 PM

Hyderabad escaped from heavy rain:  వాయుగుండం కాస్తా అల్పపీడనంగా మారింది.. అల్పపీడనం కూడా చాలా బలహీనపడింది… అది కూడా తెలంగాణ సరిహద్దు దాటి మహారాష్ట్ర దిశగా వెళ్ళిపోతోంది. సో.. తెలంగాణకు వానగండం ప్రస్తుతానికి తప్పినట్లే. ఇది తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయుగుండం మరింత బలహీనపడి అల్పపీడనంగా మారి.. ఇంకా వీక్ అయ్యి.. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్రలోని షోలాపూర్ మీదుగా కేంద్రీకృతమైంది.

భారీ వర్షాలకు ఇక అవకాశం తగ్గింది. మరో అల్పపీడనమో, వాయుగుండమో లేక ఉపరితల ద్రోణో ఏర్పడితే తప్ప తెలంగాణకు మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి వర్షగండం తప్పిందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణలో ఈరోజు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం వుందని తెలిపింది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని చెబుతోంది. గురు, శుక్రవారాల్లో తేలికపాటి వర్షాలుంటాయని వెల్లడించింది.

కాగా, రెండు రోజుల పాటు కురిసిన అతి భారీ వర్షాలతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతోపాటు నల్గొండ, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.  నగరంలోని లోతట్టు ప్రాంతాలతో ఓ మోస్తరు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. చెరువులు, కుంటల కట్టలు తెగిపోయాయి. హుస్సేన్ సాగర్ మత్తడి దుంకుతోంది. నగరానికి తాగునీరందించే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు. నగరం మధ్య నుంచి ప్రవహించే మూసీ నది పొంగి ప్రవహిస్తోంది. అయితే మరిన్ని వర్షాలుంటాయన్న ప్రచారంతో వణికిపోయిన నగర ప్రజలకు తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన బులెటిన్ కాస్త ఊరటనిచ్చేదిగా వుంది. అల్పపీడన ద్రోణి బలహీనపడి, మహారాష్ట్రకు తరలివెళ్ళిపోవడంతో నగరంతోపాటు తెలంగాణలో ఇక తేలికపాటి వర్షాలకే ఆస్కారం వుందని వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు.

Also read: Dubbaka By-poll: టీఆర్ఎస్, బీజేపీ నామినేషన్లు దాఖలు

Also read: కుంగిన రోడ్డు.. ప్రమాదంలో మెట్రో పిల్లర్

Also read: రెండోతరం వాక్సిన్‌తోనే సాధారణ స్థితి

Also read: చంద్రబాబుకు ఛాన్సివ్వండి..హైకోర్టు ఆదేశం

Also read: అక్టోబర్ 28న కృష్ణా రివర్ బోర్డు భేటీ

Also read: నవంబర్ 9న రాజ్యసభ ఎన్నికలు

Also read: కోలుకున్న గేల్.. బెంగళూరుతో మ్యాచ్‌కు రెడీ

Also read: మహేశ్ హత్యకేసులో ఇద్దరి అరెస్టు!

ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు